కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w07 7/1 పేజీ 32
  • పిల్లల కోసం ప్రాముఖ్యమైన పాఠాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పిల్లల కోసం ప్రాముఖ్యమైన పాఠాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
w07 7/1 పేజీ 32

పిల్లల కోసం ప్రాముఖ్యమైన పాఠాలు

అర్జెంటీనాలో ఉన్న మెండోజాలోని ఒక పాఠశాలలో గ్లాడిస్‌ పనిచేస్తోంది. ఒకరోజు ఆమె ఒక తరగతిగది ముందునుండి వెళ్తూ ఒక టీచరు నాల్గవ తరగతి పిల్లలకు నా బైబిలు కథల పుస్తకములోa నుండి కథలను చదివి వినిపించడాన్ని గమనించింది. గ్లాడిస్‌ తానొక యెహోవాసాక్షినని ఆ టీచరుకు పరిచయం చేసుకుని, ఆ పుస్తకం నుండి పూర్తి ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో చూపిస్తానని చెప్పింది. గ్లాడిస్‌ వివరించినదాన్ని బట్టి ఆ టీచరు ప్రభావితురాలై, ఆ పుస్తకాన్ని సిలబస్‌లో చేర్చాలనుకుంది. అయితే, అలా చేయడానికి ముందుగా ఆమె పాఠశాల నిర్వాహకుల అనుమతిని తీసుకోవాల్సివుంటుంది. సంతోషకరంగా ఆమెకు అనుమతి లభించింది.

ఆ తర్వాత, పుస్తకాలు చదవడాన్ని ప్రోత్సహించేందుకే ప్రత్యేకించబడిన ఒక రోజున తన తరగతి పిల్లలు, స్కూలు విద్యార్థులందరి ముందు ఆ పుస్తకంలోనుండి ఒక అధ్యాయాన్ని చదివి వినిపించేలా ఆమె ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించడంతో, ఆ టీచర్‌ను స్థానిక టీవీ కార్యక్రమానికి అతిథిగా పిలిచారు. స్కూలు పిల్లల ప్రవర్తన గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆ కార్యక్రమ వ్యాఖ్యాత, “మీ తరగతి పిల్లల్ని మీరెలా మంచి క్రమశిక్షణలో పెట్టగలుగుతున్నారు” అని అడిగాడు. దానికి ఆ టీచరు, నా బైబిలు కథల పుస్తకము అనే ప్రచురణను ఉపయోగిస్తున్నానని చెప్పింది. తన తరగతిలో మతాన్ని బోధించకపోయినా ఈ పుస్తకం ద్వారా పిల్లలకు గౌరవం, సహనం, ఐక్యత, సహకారం, విధేయత, ప్రేమవంటి నైతిక విలువలను నేర్పిస్తున్నానని ఆమె చెప్పింది. ఇవి పిల్లలు నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠాలు అని అందరూ అంగీకరించారు.

మీరు కూడా ఇలాంటి విలువలనే మీ పిల్లలకు నేర్పించాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఒక యెహోవాసాక్షి నుండి నా బైబిలు కథల పుస్తకము అనే అద్భుతమైన ప్రచురణను పొందవచ్చు.

[అధస్సూచి]

a యెహోవాసాక్షులు ప్రచురించినది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి