కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w06 7/15 పేజీ 3
  • దేవుని రాజ్యమంటే ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని రాజ్యమంటే ఏమిటి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏదెను తోటలో జీవితం ఎలా ఉండేది?
    దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • పరదైసులో జీవించే అవకాశం చేజారిపోయింది
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • దుష్టత్వం కొనసాగడానికిగల కారణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • సంతృప్తికరమైన జీవితం—ఎందుకంత అసాధ్యంగా ఉంది?
    సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
w06 7/15 పేజీ 3

దేవుని రాజ్యమంటే ఏమిటి?

మానవ చరిత్రారంభంలోనే మానవజాతికి ఎంతటి ఘోరమైన విపత్తు సంభవించిందో కదా! ఒక దేవదూత తనను సృష్టించిన దేవుని అధికారానికే వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటుదారుడు, నిషేధించబడిన పండును తినమని మొదటి స్త్రీయైన హవ్వను పురికొల్పాడు. ఆమెను, ఆమె భర్తయైన ఆదామును ఉద్దేశించి మాట్లాడుతూ ఆ దేవదూత ఇలా అన్నాడు: “మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.” (ఆదికాండము 2:16, 17; 3:1-5) తిరుగుబాటుదారుడైన ఆ దేవదూత అపవాది అని సాతాను అని పిలవబడ్డాడు.​—ప్రకటన 12:9.

హవ్వ సాతాను మాటలకు అవధానం ఇచ్చిందా? బైబిలు మనకు ఇలా చెబుతోంది: “స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను.” (ఆదికాండము 3:6) అవును, ఆదిదంపతులైన ఆదాముహవ్వలు ఆ తిరుగుబాటులో సాతానుతో చేయికలిపారు. దానికి పర్యవసానంగా వారు పరదైసును కోల్పోవడమే కాక, తమ సంతానానికి కూడా దానిని లేకుండా చేశారు. నిత్యజీవపు నిరీక్షణతో పరిపూర్ణంగా పుట్టాల్సిన వారి పిల్లలు, పాపాన్ని, మరణాన్ని వారసత్వంగా పొందారు.​—రోమీయులు 5:12.

విశ్వసర్వాధిపతియైన యెహోవా దేవుడు దానికి ఎలా స్పందించాడు? పాపాల క్షమాపణకు ఒక ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించాడు. (రోమీయులు 5:⁠8) ఈ గడ్డు పరిస్థితితో వ్యవహరించేందుకు యెహోవా దేవుడు ఒక ప్రభుత్వ ఏర్పాటును కూడా చేశాడు. ఆ ఏర్పాటు “దేవుని రాజ్యము” అని పిలవబడుతోంది. (లూకా 21:31) దేవుని విశ్వ పరిపాలనకు అనుబంధంగా నెలకొల్పబడిన ఆ రాజ్యానికి ఒక నిర్దిష్ట సంకల్పం ఉంది.

దేవుని రాజ్యానికున్న సంకల్పమేమిటి? ఆ రాజ్యానికి సంబంధించిన కొన్ని విషయాలేమిటి, మానవ పరిపాలనకు దానికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటి? రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభమౌతుంది? ఈ ప్రశ్నలు, తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడతాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి