కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w05 7/15 పేజీ 32
  • “వారు రాజీపడలేదు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “వారు రాజీపడలేదు”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
w05 7/15 పేజీ 32

“వారు రాజీపడలేదు”

“నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు” అని యేసు తన శిష్యులకు చెప్పాడు. (మత్తయి 5:11) నేడు యెహోవాసాక్షులు ధన్యులుగా ఉండడానికి లేదా సంతోషంగా ఉండడానికి కారణం వారు క్రీస్తు బోధకు, మాదిరికి అనుగుణంగా అన్ని రకాల పరిస్థితుల్లో “లోకసంబంధులు”గా ఉండరు, రాజకీయ తటస్థతను ఖచ్చితంగా కాపాడుకుంటారు, దేవునిపట్ల యథార్థంగా ఉంటారు.​—యోహాను 17:14; మత్తయి 4:8-10.

ఇస్టోనియాతోపాటు మునుపటి సోవియట్‌ యూనియన్‌లో యెహోవాసాక్షులు కనబరచిన రాజీపడని వైఖరిని గురించి లూథరన్‌ వేదాంతి, బైబిలు అనువాదకుడైన టూమస్‌ పాల్‌ కిరిక్‌ కెసెట్‌ కూల (పల్లె మధ్యలో ఉన్న చర్చి) అనే తన పుస్తకంలో ఇలా వ్రాశాడు: “ఏప్రిల్‌ 1, 1951 తెల్లవారుజామున జరిగిన ఘటనల గురించి చాలా కొద్దిమందే విన్నారు. యెహోవాసాక్షులను, వారితో సహవసిస్తున్నవారిని తుడిచివేసే ఒక కార్యక్రమం గురించి పథకం వేయబడింది, యెహోవాసాక్షుల్లో మొత్తం 279 మందినీ పట్టుకొని వారిని దేశం నుండి బహిష్కరించి సైబీరియాకు పంపించారు . . . దేశ బహిష్కారాన్ని లేక నిర్భందాన్ని తప్పించుకోవడానికి వారు తమ విశ్వాసాన్ని వదులుకుంటున్నట్లు ఒక సాధారణ ఫారం మీద సంతకం చేసే అవకాశం వారికి ఇవ్వబడింది . . . ఇంతకుముందు అరెస్టు అయిన వారితో కలిసి 353 మంది నిర్భందించబడ్డారు, వారిలో దాదాపు 171 మంది కేవలం వారి సంఘాలతో సహవసిస్తున్నవారు ఉన్నారు. వారు సైబీరియాలో కూడా రాజీపడలేదు . . . యెహోవాసాక్షులు చూపించినటువంటి విశ్వాసాన్ని [ఇస్టోనియన్‌ లూథరన్‌] చర్చికి చెందినవారిలో చాలా తక్కువమంది చూపించారు.”

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు శ్రమలు ఎదురైనా దేవునికి నమ్మకంగా, విధేయులుగా ఉండేందుకు దేవుడే తమకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. తమ నమ్మకం కారణంగా లభించే ప్రతిఫలం అధికంగా ఉంటుందని తెలుసుకొని వారు ఆనందిస్తారు.​—మత్తయి 5:12.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి