కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w04 12/15 పేజీ 30
  • మీకు జ్ఞాపకమున్నాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు జ్ఞాపకమున్నాయా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మీకు మద్యపానీయాలను గూర్చి దైవిక దృక్కోణముందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మద్యం సేవించే విషయంలో సమతుల్యమైన దృక్కోణాన్ని కాపాడుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
w04 12/15 పేజీ 30

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• భావోద్రేక, ఆధ్యాత్మిక అలసటను ఎదుర్కొన్నప్పుడు ఒక క్రైస్తవుడు ఏమి చేయవచ్చు?

అలసటకు కారణమేమిటో మనం అర్థం చేసుకోవాలి. మన అలవాట్లను పరీక్షించుకొని, మన దగ్గర ఏయే వస్తువులు ఉన్నాయో వాటి పట్టిక వేసుకొని, అనవసరమైనవి ఏమైనా ఉంటే వాటి భారాన్ని తొలగించుకోవడం మనకు సహాయం చేస్తుంది. మన పరిస్థితులకు తగిన వాస్తవిక లక్ష్యాలను పెట్టుకోవచ్చు. మన ఆధ్యాత్మిక ఆరోగ్యం కాపాడుకోవడం మనకు ప్రాముఖ్యం, దీనిలో దేవునికి క్రమంగా ప్రార్థించడం, ధ్యానించడం ఉన్నాయి.​—8/15 23-6 పేజీలు.

• యెహోవాసాక్షులు 1,44,000 సంఖ్యను అక్షరార్థంగా ఎందుకు తీసుకుంటారు?

అపొస్తలుడైన యోహానుకు 1,44,000 మంది గురించి చెప్పబడిన తర్వాత, ఆయన ‘యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహమును’ చూశాడు. (ప్రకటన 7:4, 9) ఒకవేళ 1,44,000 అనే సంఖ్య సూచనార్థకమే అయితే, ఈ రెండు గుంపుల మధ్యవున్న తేడా స్పష్టం కాదు. యేసు తనతోపాటు పరిపాలించేవారి గురించి మాట్లాడుతూ వారిని ‘చిన్న మంద’ అన్నాడు. (లూకా 12:32)​—9/1, 30వ పేజీ.

• ఇశ్రాయేలీయులు రక్తం కార్చబడని చనిపోయిన జంతువును అన్యునికి ఎందుకు అమ్మవచ్చు?

అన్యులు లేదా యూదామత ప్రవిష్టులు కాని పరదేశులు ధర్మశాస్త్రం క్రింద లేరు. కాబట్టి అలాంటి జంతువులను వాళ్ళకు ఇచ్చేందుకు లేదా అమ్మేందుకు ఒక ఇశ్రాయేలీయునికి అనుమతి ఉంది. (ద్వితీయోపదేశకాండము 14:21) అయితే యూదామత ప్రవిష్టుడు ధర్మశాస్త్ర నిబంధనకు కట్టుబడి ఉండాలి కాబట్టి అలాంటి రక్తం కార్చబడని జంతు మాంసం తినకూడదు. (లేవీయకాండము 17:10)​—9/15 26వ పేజీ.

• బయోమిమెటిక్స్‌ అంటే ఏమిటి, అది క్రైస్తవులకు ఎందుకు ఆసక్తికరమైనది?

అది ప్రకృతి పరికల్పనలను అనుకరించడానికి ప్రయత్నించే విజ్ఞానశాస్త్ర రంగం. ఉదాహరణకు, రైట్‌ సోదరులు ఎగిరే పెద్ద పక్షులను అధ్యయనం చేసిన తర్వాత విమానాన్ని తయారు చేశారు. అలా బయోమిమెటిక్స్‌ సృష్టికర్తను మహిమపరచడానికి ఒక క్రైస్తవుణ్ణి పురికొల్పుతుంది.​—10/1, 9వ పేజీ.

• పరదైసులోనికి కొనిపోబడ్డాడని 2 కొరింథీయులు 12:2-4లో పేర్కొనబడిన మనుష్యుడు ఎవరు?

ఆ మాటలు, పౌలు అపొస్తలునిగా తనకున్న అధికారాన్ని సమర్థిస్తూ మాట్లాడిన తర్వాతి వచనాల్లోనే ఉన్నాయి. అలాంటి అనుభవం ఎదురైన వేరే ఏ వ్యక్తి గురించీ బైబిలు మాట్లాడడం లేదు, పైగా ఆ మాటలు చెప్పింది పౌలే కాబట్టి, ఆ దర్శనం బహుశా పౌలుకే కలిగివుంటుంది.​—10/15, 8వ పేజీ.

• దేవుడు ఎంచుకున్న నాయకునిగా పనిచేయడానికి యేసును అర్హుణ్ణిచేసిన లక్షణాల్లో కొన్ని ఏమిటి?

నిజాయితీ, నీతిమంతమైన ప్రవర్తనతో యేసు పరిపూర్ణ యథార్థతను కాపాడుకున్నాడు. ఆయన సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. యేసుకు ప్రజలపట్ల ప్రగాఢమైన శ్రద్ధ ఉండడమే కాక, ఆయన పనిచేయడానికి ఇష్టపడ్డాడు.​—11/1 6-7 పేజీలు.

• వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో దయ్యాలు ఎక్కడ ఉంటారు?

క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో వారు సాతానుతోపాటు అగాధంలో వేయబడతారని మనం న్యాయంగా తేల్చి చెప్పవచ్చు. (ప్రకటన 20:1-3) సాతాను తలమీద కొట్టబడడం గురించి ఆదికాండము 3:15 ప్రవచించింది, అంటే అతడు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో అగాధంలో పడవేయబడడం కూడా దానిలో ఒక భాగమే. అతని సంతానంలో, దుష్టాత్మలు లేదా దయ్యాలు కూడా ఉన్నారు. అగాధంలో పడవేయబడతామనే భయాన్ని వారు వ్యక్తం చేయడం, తాము భవిష్యత్తులో నిర్బధించబడతామనే విషయం వారికి తెలుసని సూచిస్తోంది. (లూకా 8:30-31)​—11/15 30-1 పేజీలు.

• ఒక వ్యక్తి త్రాగుబోతు అయ్యేంతగా మద్యం త్రాగకపోయినప్పటికీ, మద్యపానీయాలు సేవించే విషయంలో ఆయన ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

మద్యం ఎక్కువగా సేవించినప్పటికీ కొంతమంది త్రాగుబోతుల లక్షణాలు కనబరచరు. అయితే, ఒక వ్యక్తి మద్యానికి క్రమేణా అలవాటుపడి ‘మిగుల మద్యపానాసక్తునిగా’ తయారుకావచ్చు. (తీతు 2:3) ‘తిండివలనను మత్తువలనను మందముగా’ ఉండడం గురించి యేసు హెచ్చరించాడు. (లూకా 21:34, 35) త్రాగుబోతయితేనే ఒక వ్యక్తి శారీరకంగా, ఆధ్యాత్మికంగా మందునిగా, సోమరిగా తయారవుతాడని చెప్పడానికి వీల్లేదు.​—12/1 19-21 పేజీలు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి