కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w04 7/15 పేజీ 32
  • “యెహోవా నామాన్ని ప్రకటించడానికి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యెహోవా నామాన్ని ప్రకటించడానికి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
w04 7/15 పేజీ 32

“యెహోవా నామాన్ని ప్రకటించడానికి”

ప్రపంచవ్యాప్తంగా కావలికోట, తేజరిల్లు! పత్రికలు వాటిలోని ఆధ్యాత్మిక విషయాలకు ఉపదేశాత్మకమైన సమాచారానికి ప్రశంసలందుకుంటున్నాయి. అలాంటి ప్రశంసలను ప్రతిబింబిస్తూ ఫ్రాన్స్‌కు చెందిన ఒక పాఠకురాలు ఇటీవల ఈ ఉత్తరం వ్రాసింది:

“నేను ఆఫ్రికాకు చెందిన యువతిని, నేను చాలా తక్కువ చదువుకున్నాను. కొంతకాలంనుండి నేను మీ పత్రికలను చదువుతున్నాను. వాటిలో చర్చించబడిన విషయాలకు ఆకర్షించబడిన నేను చదవడం ఎంత విలువైనదో తెలుసుకుంటున్నాను. మీ పత్రికల కారణంగా నేను నా పదసంపదను మెరుగుపరచుకున్నాను, నేను ఇప్పుడు ఎక్కువ తప్పులు లేకుండా ఉత్తరం వ్రాయగలను.

“మీరు మానవులకు, భూగ్రహానికి, సృష్టికర్తకు సంబంధించిన ప్రతీ విషయం గురించి శీర్షికలను ప్రచురించడం నన్ను ఆశ్చర్యంతో నింపుతుంది. ఆ శీర్షికలు ఎంత స్పష్టంగా వివరించబడతాయంటే ఒక వ్యక్తి ఆత్రుతతో వాటిని చదవాలని కోరుకునేలా అవి ఉంటాయి. అన్ని విధాల ప్రజలకు ఒకే సమయంలో బోధించగల సామర్థ్యం ఇంకెవ్వరికీ లేదు.

“అయితే ఇదంతా లాభాలు గడించడానికి కాదు కానీ కేవలం యెహోవా నామాన్ని ప్రకటించడానికి మాత్రమే చేయబడుతుందని చూసినప్పుడు కూడా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మీకు ఆయన ఆమోదం ఉందని నాకు తెలుసు, నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్కువ బోధించడానికి వీలుగా మీరు సృష్టికర్త నుండి బలం పొందుతూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను.”

యెహోవాసాక్షులు ప్రస్తుతం 235 దేశాల్లో బైబిలు విద్యా పనిని నిర్వహిస్తున్నారు. కావలికోట 148 భాషల్లోను తేజరిల్లు! 87 భాషల్లోను ప్రచురించబడుతోంది. ఈ పత్రికలు మనుష్యులకు ఘనతను తీసుకురావడానికి ప్రచురించబడడం లేదు. “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును” అని చెబుతున్న సృష్టికర్తను ఘనపరచడానికే ఈ పత్రికల్లోని బైబిలు ఆధారిత ఉపదేశమూ తాజా సమాచారమూ తయారుచేయబడ్డాయి. (యెషయా 48:17) ఈ బైబిలు అధ్యయన సాధనాలతోపాటు పరిశుద్ధ లేఖనాలను క్రమంగా చదవడం ద్వారా మీరు ప్రయోజనం పొందుదురు గాక.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి