కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w04 3/15 పేజీ 3
  • మీపై ప్రభావంచూపే ఆచరణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీపై ప్రభావంచూపే ఆచరణ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రభువు రాత్రి భోజనం—దేవుణ్ణి మహిమపరిచే ఆచరణ
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ‘నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ప్రభువు రాత్రి భోజనాన్ని ఎందుకు ఆచరించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ప్రభువు రాత్రి భోజనం ఎలా ఆచరించబడింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
w04 3/15 పేజీ 3

మీపై ప్రభావంచూపే ఆచరణ

భూమిపై ఉన్నప్పుడు, యేసుక్రీస్తు దేవుణ్ణి మహిమపరిచే ఒక ఆచరణను నెలకొల్పాడు. దీనిని ఆచరించండి అని ఆయన తన అనుచరులను సూటిగా ఆజ్ఞాపించిన మతాచరణ అదొక్కటే. అదే ప్రభువు రాత్రి భోజనం, దానినే చివరి భోజనమని కూడా పిలుస్తారు.

ఆ సందర్భానికి నడిపే సంఘటనల్ని మీరు అదృశ్యంగా అక్కడేవుండి ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా ఊహించుకోండి. యూదుల పస్కాను ఆచరించడానికి యేసు, ఆయన అపొస్తలులు కలిసి యెరూషలేములోని ఒక మేడగదికి చేరుకున్నారు. కాల్చిన గొఱ్ఱె, చేదుకూరలు, పులియని రొట్టె, ఎర్రని ద్రాక్షారసం ఉండే ఆచారబద్ధమైన పస్కా భోజనాన్ని వారు ముగించారు. విశ్వాసఘాతకుడైన అపొస్తలుడు యూదా ఇస్కరియోతు అక్కడినుండి పంపివేయబడ్డాడు, కాసేపట్లో అతడు తన యజమానిని అప్పగిస్తాడు. (మత్తయి 26:17-25; యోహాను 13:21, 26-30) యేసు తన 11 మంది నమ్మకస్థులైన అపొస్తలులతో ఉన్నాడు. వారిలో మత్తయి ఒకడు.

మత్తయి ప్రత్యక్ష సాక్ష్యం ప్రకారం, యేసు ఈ విధంగా ప్రభువు రాత్రి భోజనాన్ని నెలకొల్పాడు: “యేసు ఒక [పులియని] రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి—మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన [ద్రాక్షారసపు] గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి—దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.”​—మత్తయి 26:26-28.

ప్రభువు రాత్రి భోజనాన్ని యేసు ఎందుకు నెలకొల్పాడు? అలాచేసేటప్పుడు ఆయన పులియని రొట్టెను, ఎర్రని ద్రాక్షారసాన్ని ఎందుకు ఉపయోగించాడు? ఈ చిహ్నాలలో క్రీస్తు అనుచరులందరూ పాలుపంచుకోవాలా? ఎంత తరచుగా ఈ భోజనాన్ని ఆచరించాలి? నిజానికి అది మీకెంత ప్రాముఖ్యం?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి