మృతుల విషయంలో దేవుని ఉద్దేశం
ప్రియమైన వారు మరణించడం నిజంగా మనస్సును కృంగదీస్తుంది. శూన్యభావం, ఒంటరితనం, ఏదో పోగొట్టుకున్నామనే భావం అపారంగా ఉంటాయి. వియోగం ఒక వ్యక్తిని తాను నిస్సహాయుడని భావించేలా చేయగలదు, ఎందుకంటే ఆ వ్యక్తికి ఎంత ధనమున్నా, అధికారమున్నా లేదా పలుకుబడివున్నా ఈ భూమ్మీద ఎవ్వరూ మరణించిన వ్యక్తిని పునర్జీవింపజేయలేరు.
అయితే, మన సృష్టికర్త ఈ విషయాన్ని మరోలా దృష్టిస్తున్నాడు. ఆయన మొదటి మానవుణ్ణి నేల మట్టినుండి రూపించాడు కాబట్టి, ఆయన మరణించిన వ్యక్తిని కూడా పునఃసృష్టించ సమర్థుడు. ఈ కారణం చేతనే, మరణించిన వారిని దేవుడు సజీవులుగానే దృష్టించగలడు. మరణించిన ప్రాచీనకాల విశ్వాస సేవకుల గురించి, యేసు ఇలా చెప్పాడు: “ఆయన [దేవుని] దృష్టికి అందరును జీవించుచున్నారు.”—లూకా 20:37.
యేసు ఈ భూమ్మీదున్నప్పుడు, మృతులను పునరుత్థానంచేసే శక్తిని పొందాడు. (యోహాను 5:21) కాబట్టి, నమ్మకంగా ఉండి మరణించిన వారిపట్ల తండ్రికున్న దృక్కోణాన్నే ఆయన కూడా కలిగివున్నాడు. ఉదాహరణకు, తన స్నేహితుడగు లాజరు మరణించినప్పుడు, యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: ‘అతని మేలుకొలుప వెళ్లుచున్నాను.’ (యోహాను 11:11) మానవుల దృష్టిలో లాజరు మరణించాడు, అయితే యెహోవా యేసుల దృష్టిలో లాజరు నిద్రిస్తున్నాడు.
యేసు రాజ్యపాలన క్రింద, “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము” ఉంటుంది. (అపొస్తలుల కార్యములు 24:14) చివరికి, పునరుత్థానం చేయబడినవారు దైవిక విద్యపొంది, భూమ్మీద నిత్యజీవ ఉత్తరాపేక్ష కలిగివుంటారు.—యోహాను 5:28, 29.
అవును, ప్రియమైన వారి మరణం ఎంతో దుఃఖానికి మనస్సు కృంగడానికి కారణమౌతుంది, ఆ పరిస్థితి సంవత్సరాల తరబడి కొనసాగవచ్చు. అయినప్పటికీ, మరణించినవారిని దేవుని దృష్టితోచూడడం గొప్ప ఆదరణనిచ్చి మనలను నిరీక్షణతో నింపగలదు.—2 కొరింథీయులు 1:3, 4.