మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు మీరు సమాధానమివ్వగలరేమో చూడండి:
• షాఫాను కుటుంబం గురించి తెలుసుకోవడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
షాఫాను, యోషీయా రాజు దగ్గర లేఖికునిగా, శాస్త్రిగా పనిచేసేవాడు. రాజ్యంలో ఎంతో పలుకుబడిగల షాఫాను సత్యారాధనను పునఃస్థాపించడానికి యోషీయా చేపట్టిన చర్యకు మద్దతునిచ్చాడు. షాఫాను కుమారుల్లో ఇద్దరు యిర్మీయా ప్రవక్తకు విశ్వసనీయులుగా కొనసాగారు. షాఫాను మరో కుమారుడు, ఇద్దరు మనుమలు కూడా తమ పలుకుబడిని సత్యారాధన కోసం ఉపయోగించారు. అదేవిధంగా మనం మన వనరులను మన పలుకుబడిని సత్యారాధనకు మద్దతునివ్వడానికి ఉపయోగించాలి.—12/15, 19-22 పేజీలు.
• ఇరేన్ హోక్స్టెన్బాక్ ఎలా తన శారీరక వైకల్యాన్ని అధిగమించి యెహోవాను సేవించగలిగింది?
ఆమె ఏడు సంవత్సరాల వయసులోనే వినికిడి శక్తిని కోల్పోయింది. చెవుడు ఉన్నప్పటికీ ఆమె ఇతరులతో సంభాషించడం నేర్చుకొని ఇప్పుడు తన భర్త (ప్రయాణ పైవిచారణకర్త) నెదర్లాండ్స్‌లోని సంఘాలను సందర్శిస్తుండగా ఆమె ఆయనతో కలిసి ప్రయాణిస్తోంది.—1/1, 23-6 పేజీలు.
• “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశాల్లో విడుదల చేయబడిన రెండు కొత్త అధ్యయన సహాయకాలు ఏవి?
కొత్త వారు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని అధ్యయనం చేయడం పూర్తి చేసిన తర్వాత వారితో అధ్యయనం చేసేందుకు రూపొందించబడిన ఏకైక సత్యదేవుణ్ణి ఆరాధించండి (ఆంగ్లం) పుస్తకాన్ని పొందడానికి భూవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు సంతోషించారు; యెహోవాకు సన్నిహితమవ్వండి (ఆంగ్లం) అన్నది మరో కొత్త పుస్తకం, ఇది యెహోవా లక్షణాలపై, ఆయన వ్యవహరించే విధానాలపై అవధానముంచుతుంది. ఆయన లక్షణాలను ప్రదర్శించడంలో మనం ఆయనను ఎలా అనుకరించవచ్చో కూడా అది చూపిస్తుంది.—1/15, 23-4 పేజీలు.
• “నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు” అని ఉన్న సామెతలు 12:5వ వచనం భావం ఏమిటి?
మంచి ప్రజల ఆలోచనలు కూడా నైతికంగా సరైనవిగా, నిష్పక్షపాతంగా, న్యాయమైనవిగా ఉంటాయి. నీతిమంతులు దేవునిపట్ల, తోటి మానవులపట్ల ఉన్న ప్రేమను బట్టి కదిలించబడతారు కాబట్టి వారి ఉద్దేశాలు మంచివి.—1/15, 30వ పేజీ.
• పని విషయంలో సమతుల్యమైన దృక్కోణాన్ని పెంపొందించుకోవడానికి ఒక వ్యక్తికి ఏది సహాయపడవచ్చు?
పనిని గౌరవించేలా బాల్యంనుండే శిక్షణ పొందడం ఉపయోగకరంగా ఉంటుంది. పనిలో నీతినియమాలను పాటించమని సోమరితనాన్ని నివారించమని బైబిలు మనలను ప్రోత్సహిస్తోంది. (సామెతలు 20:4) పనిలో పూర్తిగా మునిగిపోవద్దని కూడా బైబిలు క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. మన జీవితంలో దేవుని సేవకు మొదటిస్థానమివ్వాలని మనం గ్రహించాలి. (1 కొరింథీయులు 7:29-31) అంతేకాకుండా, దేవుడు తమను విడిచిపెట్టడని నిజ క్రైస్తవులు నిశ్చయతతో ఉంటారు.—2/1, 4-6 పేజీలు.
• బైబిలులో బలిపీఠం గురించి మొదటిసారి ఎక్కడ ప్రస్తావించబడింది?
ఆదికాండము 8:20లో, జలప్రళయం తర్వాత ఓడలో నుండి బయటికి వచ్చాక నోవహు నిర్మించినదే బైబిలులో ప్రస్తావించబడిన మొదటి బలిపీఠం. అయితే అంతకు ముందు కయీను, హేబెలు కూడా బలిపీఠములను ఉపయోగించే తమ అర్పణలను అర్పించి ఉండవచ్చు. (ఆదికాండము 4:3, 4)—2/15, 28వ పేజీ.
• కొంతమంది క్రైస్తవులు మారిన పరిస్థితులను చక్కగా ఎలా వినియోగించుకున్నారు?
కొంతమంది తమ ఉద్యోగంలో వచ్చిన మార్పులను స్వీకరించారు—లేదా తామే ఆ మార్పులను సృష్టించుకున్నారు—అది వారు పరిచర్యలో ఎక్కువ సమయం వెచ్చించడానికి అవకాశాన్నిచ్చింది. ఇతరులు, తమ కుటుంబ బాధ్యతలు తగ్గిపోయినప్పుడు అంటే తమ పిల్లలు పెద్దవారై వివాహాలు చేసుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుని సేవకు వెచ్చించే సమయాన్ని, సేవ చేసే అవకాశాలను అధికం చేసుకొన్నారు.—3/1, 19-22 పేజీలు.
• ఇతరులను యెహోవా చూసినట్లు చూడడానికి మనకు యోనా మాదిరి, అపొస్తలుడైన పేతురు మాదిరి ఎలా సహాయపడతాయి?
పేతురు యోనాల ఆలోచనా విధానంలో, విశ్వాసానికీ విధేయతకూ సంబంధించిన పరీక్షలకు వారు ప్రతిస్పందించిన విధానంలో ఉన్న లోపాలు అందరికీ తెలిసినవే. అయినప్పటికీ యెహోవా వారిలో మంచి లక్షణాలను చూసి వారిని తన సేవలో ఉపయోగించుకోవడంలో కొనసాగాడు. ఇతరులు మనలను బాధపెట్టినప్పుడు లేదా మనకు ఆశాభంగం కలిగించినప్పుడు, గతంలో మనకు వారిలో నచ్చిన మంచి లక్షణాలపై, దేవుడు వారిలో చూసే మంచిపై మనం అవధానముంచవచ్చు.—3/15, 16-19 పేజీలు.
• కీర్తనల గ్రంథములోని కీర్తనలకు, వచనాలకు కేటాయించబడిన సంఖ్యలు వివిధ బైబిలు అనువాదాలలో విభిన్నంగా ఎందుకు ఉంటాయి?
హీబ్రూ మూలపాఠంలోని కీర్తనల పుస్తకంలోని సంఖ్యలకు, దాని గ్రీకు అనువాదమైన సెప్టాజింట్‌లోని కీర్తనల పుస్తకంలోని సంఖ్యలకు తేడా ఉంది. హీబ్రూ ఆధారంగా అనువదించబడ్డాయా లేదా సెప్టాజింట్ ఆధారంగా అనువదించబడ్డాయా అనే విషయంపై ఆధారపడి ఇటీవలి అనువాదాల్లో తేడా ఉండవచ్చు.—4/1, 31వ పేజీ.