కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 3/15 పేజీ 3
  • జ్ఞాపకముంచుకోవలసిన రోజు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జ్ఞాపకముంచుకోవలసిన రోజు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసుక్రీస్తు ఆయన సందేశం మీకెందుకు ప్రాముఖ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యోహాను 3:16—“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను”
    బైబిలు వచనాల వివరణ
  • మానవజాతిని రక్షించుటకు దేవుడేమి చేశాడు
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • యేసు మీ జీవితాన్ని ఎలా మార్చగలడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 3/15 పేజీ 3

జ్ఞాపకముంచుకోవలసిన రోజు

శాశ్వత ఆశీర్వాదాలను అనుభవించే నిరీక్షణనిస్తూ మానవజాతి భవిష్యత్తును పూర్తిగా మార్చివేసిన రోజు అది. చరిత్రలోని మరే ఇతర రోజూ మానవజాతి భవిష్యత్తును అంతగా ప్రభావితం చెయ్యలేదు. యేసు ఏ పనులను చేయడానికి భూమ్మీదకు వచ్చాడో వాటన్నింటినీ పూర్తి చేసిన రోజది. హింసా కొయ్యకు మేకులతో కొట్టబడిన ఆయన తుది శ్వాస తీసుకొని ‘సమాప్తమైనది!’ అని బిగ్గరగా అన్నాడు. (యోహాను 19:30) యేసు ఏ సంకల్పం కోసం భూమ్మీదకు వచ్చాడు?

“మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చె[ను]” అని బైబిలు చెబుతోంది. (మత్తయి 20:28) వారసత్వంగా సంక్రమించిన పాపమరణాల నుండి మానవజాతిని రక్షించడానికి యేసు తన ప్రాణాన్ని లేదా జీవితాన్ని అర్పించాడు. నిజమే, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) యేసు బలి ఎంత విలువైన ఏర్పాటో కదా!

యేసు మరణించిన దినమును జ్ఞాపకముంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఆ రోజున, దేవుని కుమారుడు తన అపొస్తలులు నమ్మకంగా ఉండేందుకు వారికి సహాయపడే విలువైన పాఠాలను నేర్పించాడు. ఆయన మాట్లాడిన చివరి మాటలు ఆ శిష్యుల హృదయాలను ఎంతగా కదిలించివుంటాయో కదా! ఆయన ఏమి బోధించాడు? యేసు వారికి బోధించిన దాని నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? ఈ ప్రశ్నలు తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడతాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి