కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w01 11/15 పేజీలు 2-4
  • రక్షించబడతామనే నిరీక్షణ ఏమైనా ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రక్షించబడతామనే నిరీక్షణ ఏమైనా ఉందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ “రక్షణనిరీక్షణ”ను ఉజ్వలంగా ఉంచుకోండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • రక్షణ నిజంగా దాని భావమేమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • రక్షణ అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ‘ఒకసారి రక్షణ పొందితే, శాశ్వతంగా రక్షణ పొందినట్లే’ అని బైబిలు చెప్తోందా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
w01 11/15 పేజీలు 2-4

రక్షించబడతామనే నిరీక్షణ ఏమైనా ఉందా?

20వ శతాబ్దం మానవజాతి ఇంతకు మునుపెన్నడూ చూడనంతగా రక్తపుటేర్లు ప్రవహించిన శతాబ్దాల్లో ఒకటని పిలువబడింది. నేరాలు, యుద్ధాలు, జాతుల సంఘర్షణలు, మాదకద్రవ్యాల దుర్వినియోగాలు, మోసాలు, హింసలు ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాల్లో మరీ విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి తోడు వ్యాధులు, వృద్ధాప్యము, మరణాల మూలంగా దుఃఖాలు బాధలు కూడా ప్రజలు అనుభవించారు. నేడు లోకంలో ఉన్న భయంకరమైన సమస్యలనుండి స్వేచ్ఛ లభించాలని ఎవరు మాత్రం కోరుకోరు? పైన పేర్కొన్న సమస్యల దృష్యా, మనం భవిష్యత్తులోకి చూస్తుండగా రక్షణ లభిస్తుందన్న నిరీక్షణ ఏమైనా కనబడుతోందా?

దాదాపు 2,000 సంవత్సరాల క్రితం అపొస్తలుడైన యోహాను చూసిన దర్శనాన్ని పరిశీలించండి. ఆయనిలా వ్రాశాడు: ‘ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.’ (ప్రకటన 21:3, 4) యెషయా ప్రవక్త కూడా ఇలా ప్రవచించాడు: “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.”​—యెషయా 25:8.

దేవుని వాగ్దానాలు నెరవేరితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! అణచివేత నుండి, హింసల నుండి, బాధలకు విపత్తులకు కారణమయ్యేవాటి నుండి మానవజాతి రక్షించబడుతుంది, అంటే విమోచించబడుతుంది. అంతెందుకు, వ్యాధులు, వృద్ధాప్యము, మరణము వంటివి కూడా మనలను ఇక పీడించవు! పరిపూర్ణమైన పరిస్థితుల్లో భూమిపైన నిత్య జీవితం లభిస్తుందని దేవుని వాక్యమైన బైబిలు వాగ్దానం చేస్తోంది. (లూకా 23:43; యోహాను 17:3) దాన్ని కోరుకునేవారందరికీ అది అందుబాటులో ఉంటుంది. ‘దేవుడు, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.’​—1 తిమోతి 2:3, 4.

అయితే, దేవుని వాగ్దానాల నుండి మనం ప్రయోజనం పొందాలంటే మనకు రక్షణ లభించే విషయంలో యేసుక్రీస్తు పాత్ర ఏమిటో తెలుసుకోవాలి, ఆయనపై విశ్వాసం ఉంచాలి. యేసు స్వయంగా ఇలా చెప్పాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) ఈవిషయంలో యేసు వహించే కీలకమైన పాత్రను గురించి ప్రాముఖ్యంగా చెబుతూ అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.” (అపొస్తలుల కార్యములు 4:12) అపొస్తలుడైన పౌలు ఆయన సహవాసి సీల నిజాయితీగల ఒక జిజ్ఞాసువుని ఇలా ప్రోత్సహించారు: ‘ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు.’​—అపొస్తలుల కార్యములు 16:30, 31.

అవును, యేసుక్రీస్తు “జీవాధిపతి,” ఆయన ద్వారా మాత్రమే రక్షణ సాధ్యమవుతుంది. (అపొస్తలుల కార్యములు 3:15) కానీ మనకు రక్షణ లభించడానికి ఒకే ఒక్క పురుషుడు అంతటి కీలకమైన వ్యక్తి ఎలా కాగలిగాడు? ఈవిషయంలో ఆయన పాత్రను గురించిన స్పష్టమైన అవగాహన మనం రక్షించబడతామనే నిరీక్షణను బలపరచగలదు.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

3వ పేజీ: బాంబర్లు: USAF photo; ఆకలితో అలమటిస్తున్న పిల్లలు: UNITED NATIONS/J.FRAND; కాలిపోతున్న యుద్ధనౌక: U.S. Navy photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి