కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w01 6/15 పేజీ 32
  • ‘స్నేహితుడు చేసే గాయాలు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘స్నేహితుడు చేసే గాయాలు’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
w01 6/15 పేజీ 32

‘స్నేహితుడు చేసే గాయాలు’

గలతీయలోని మొదటి శతాబ్దపు క్రైస్తవులను కాస్త సరిదిద్దాల్సిన అవసరముందని అపొస్తలుడైన పౌలు గుర్తించాడు. బహుశా వారిలో ఉక్రోష భావాలేమైనా ఉంటే వాటిని పోగొట్టాలని కావచ్చు, ఆయన ఇలా అన్నాడు: “నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?”​—గలతీయులు 4:16.

‘నిజం చెప్పడం’వల్ల పౌలు వారి శత్రువు కాలేదు. వాస్తవానికి ఆయన ఈ బైబిలు సూత్రానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాడు: “మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును.” (సామెతలు 27:6) తప్పు చేసేవారి ఆత్మాభిమానం దెబ్బతింటుందని పౌలుకు తెలుసు. కానీ, తప్పుచేసిన వ్యక్తికి కావల్సిన క్రమశిక్షణను ఇవ్వకుండా ఉంటే అతనిపై యెహోవా దేవుని ప్రేమ వ్యక్తం కాకుండా అడ్డుకున్నట్లేనని కూడా ఆయనకు తెలుసు. (హెబ్రీయులు 12:5-7) అందుకే, మేలు కోరే ఒక స్నేహితుడిగా ముఖ్యంగా సంఘ చిరకాల సంక్షేమాన్ని కోరి, సరిదిద్దే హితబోధ చేయడానికి పౌలు వెనుకాడలేదు.

“మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి” అని యేసు తమకిచ్చిన ఆదేశాన్ని నేడు యెహోవా సాక్షులు నెరవేరుస్తున్నారు. అలా చేయడంలో, ఈ యథార్థ క్రైస్తవులు సిద్ధాంతపరమైన తప్పులను, క్రైస్తవ విరుద్ధ ప్రవర్తనను, బహిర్గతం చేస్తూ వాటిని ఖండించే బైబిలు సత్యాల విషయంలో రాజీపడరు. (ఇటాలిక్కులు మావి) (మత్తయి 15:9; 23:9; 28:19, 20; 1 కొరింథీయులు 6:9, 10) ఇతరులు వారిని తిరస్కరించాల్సిన శత్రువుల్లా దృష్టించేలా కాకుండా, వారు నిజమైన స్నేహితుల్లా యథార్థమైన శ్రద్ధను చూపిస్తున్నారు.

దైవ ప్రేరేపిత అంతర్దృష్టితో కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక.”​—కీర్తన 141:5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి