“ఐక్యతకు ఒక ఉదాహరణ”
అది బ్రెజిల్‌లోని, సావోపౌలోలో ఇండియాట్యూబా అనే ప్రాంతంలో ప్రచురించబడుతున్న ఒక వార్తాపత్రికలోని సంపాదకీయం యొక్క శీర్షిక. ఎవరు అంతటి మాదిరిని చూపించారు? దాని రచయిత ఇలా వివరించాడు: “యెహోవాసాక్షులే; రాజ్యమందిరాలు అని పిలువబడే వారి ఆరాధనా మందిరాలు లేదా ఆడిటోరియమ్‌లలో ఒకదాన్ని నిర్మించేందుకు యెహోవాసాక్షులు ప్రణాళికలు వేస్తున్నారు. వారు చేస్తున్న ప్రయత్నాలు, వారిలోని అనుకూలమైన, పటిష్ఠమైన సహకారము, వారి మాదిరి వంటివాటిని మనం అలక్ష్యం చేయలేము.”
అలాంటి సందర్భాల్లో యెహోవాసాక్షుల మధ్య ఐక్యత స్పష్టంగా కన్పిస్తుంది. అలా ఆ శీర్షిక చెప్పిందేమిటంటే: “వారు ఆరాధన చేసేందుకు కలుసుకోవడం కోసం ఒక భవనాన్ని నిర్మించేందుకు ఇష్టపూర్వకంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలతో సహా అంతమంది స్వచ్ఛంద సేవకులు రావడాన్ని చూడడం ఎంతో ముచ్చటగా ఉంది.”
ఇతర విషయాల్లో కూడా యెహోవాసాక్షులు మంచి మాదిరిని ఉంచుతున్నారు. “వారు పఠనం చేస్తారు, ప్రార్థిస్తారు. అంతేకాదు వారు, మత్తుపదార్థాలకు, మద్యపానానికి బానిసలైన వాళ్ళను మామూలు మనుష్యులుగా చేయడం, ప్రజలు ఏకీభావం ప్రేమ వంటి విధానాలను అవలంబించేలా చేయడం కూడా వారి లక్ష్యమైవుంది” అని కూడా ఆ సంపాదకీయం తెలియజేసింది. వారు దీనినెలా సాధిస్తారు? అవినీతికరమైన అలవాట్ల నుండి ఒక వ్యక్తి విడుదల కావాలంటే బైబిలు హెచ్చరికలను నేర్చుకుని వాటిని అన్వయించుకోవాలి అని సాక్షులకు తెలుసు. అందుకే వాళ్ళు బైబిలు నుండి ఏమైతే నేర్చుకున్నారో దానిని ఇతరులకు బోధించేందుకు ప్రయత్నిస్తారు. వారిది, “అత్యవసరంగా అనుకరించాల్సిన మాదిరి” అని ఆ సంపాదకీయం ముగించింది.
యెహోవాసాక్షుల కూటాలకు ప్రజలందరూ హాజరవ్వవచ్చు, చందాలు సేకరించబడవు. కాబట్టి మీకు దగ్గరగా ఉన్న రాజ్యమందిరానికి మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు.