క్రైస్తవ ప్రేమ మాటలు మాత్రమే కాదు
ట్రినిడాడ్‌లోని బర్తలోమియో వాళ్ళ ఇల్లు కాలిపోయినప్పుడు వాళ్ళు సమస్తాన్ని కోల్పోయారు ప్రాణాలు మాత్రం దక్కాయి. తప్ప వాళ్ళకు దగ్గరలోనే నివసించే బంధువులు వాళ్ళను తమ ఇంటికి తీసుకువెళ్ళారు.
ఆలివ్ బర్తలోమియో యెహోవాసాక్షి. ఆమె కుటుంబం కోల్పోయిన ఇంటిని పునర్నిర్మించేందుకు, ఆమె సహవసిస్తున్న సంఘంలోని వాళ్ళు, చుట్టుప్రక్కల సంఘాల్లో వాళ్ళు ఆర్థిక సహాయం చేయడం మొదలుపెట్టారు. ఈ పునర్నిర్మాణ పనిని పర్యవేక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయబడి, నిర్మాణపని ప్రారంభమయ్యింది. నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడ 20 మంది సాక్షులు కొంతమంది పొరుగువారు ఉన్నారు. యౌవనస్థులు కూడా పాల్గొన్నారు, కొంతమంది ఫలహారాలు అందజేస్తున్నారు.
“నా కుటుంబంలోని వారందరూ విస్మయంతో చూస్తూవుండిపోయారు. వాళ్ళు సాక్షులు కారు, అందుకే నా భర్త తన కళ్ళను తానే నమ్మలేనంతగా దిగ్భ్రాంతికి గురయ్యాడు” అని ఆలివ్ చెప్పినట్లు ట్రినిడాడ్‌లోని సండే గార్డియన్ అనే వార్తాపత్రిక తెలియజేసింది.
ఆ పునర్మిర్మాణపని కో-ఆర్డినేటర్, వారు చేస్తున్న ఆ కృషిని గురించి మాట్లాడుతూ అలాంటి కార్యాలు నిజ క్రైస్తవుల నిజమైన గుర్తింపు చిహ్నాలు అన్నాడు. “మేము ఇంటింటికి వెళ్ళి ప్రేమను గూర్చి కేవలం మాట్లాడడం వరకే కాదు, మేము ప్రకటించేదాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తాము” అని చెప్పాడు.—యోహాను 13:34, 35.
[32వ పేజీలోని చిత్రం]
తన భర్తతో ఆలివ్ బర్తలోమియో