యెహోవా దృష్టికి అమూల్యమైనదాన్ని ఇవ్వటం
ఈ క్రింది ఉత్తరాన్ని మొజాంబిక్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం అందుకుంది:
“నేను ఏడు సంవత్సరాల అబ్బాయిని. నేను ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నాను. ఒక కోడిపిల్లను పెంచి సంపాదించిన ఈ డబ్బును నేను పంపుతున్నాను. దాన్ని నేను 12,000 మెటికైస్లకు అమ్మాను. నేను పెంచిన మొట్టమొదటి కోడిపిల్ల కోడిపుంజు అయ్యేలా చేసినందుకు యెహోవాకు నా ధన్యవాదాలు. నా కానుక యెహోవా రాజ్యపనికి ఉపయోగపడాలని అనుకుంటున్నాను.
“గమనిక: ఈ ఉత్తరం వ్రాయటానికి నాకు మా నాన్నగారు సాయం చేశారు.”
అన్నీ సమృద్ధిగా ఉన్నవాళ్లే ఔదార్యాన్ని చూపించాలని కొంతమంది అనుకుంటారు. అయితే, కానుక పెట్టెలో “రెండు కాసులు” వేసిన విధవరాలి వృత్తాంతాన్ని బైబిల్లో మనం చదువుతున్నప్పుడు, వేసినదాని పరిమాణాన్ని బట్టి కాదు గానీ హృదయ ప్రేరేపణను బట్టి ఆ ఔదార్యం కొలువబడుతుందని మనం గుణగ్రహించవచ్చు.—లూకా 21:1-4.
యెహోవా ప్రతి కానుకను అభినందిస్తాడు, ప్రేమతో పురికొల్పబడిన హృదయంతో ఇస్తున్నప్పుడు అది ఎంత అల్పమైనదైనా సరే. ఎవరైతే తమ సమయాన్ని, శక్తిని, లేక వస్తు సంపదల్ని తన రాజ్యం కోసం వెచ్చించడం ద్వారా తన ఔదార్యాన్ని అనుకరిస్తారో వారిని ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాడు.—మత్తయి 6:33; హెబ్రీయులు 6:10.