బైబిలు పంపిణీలో భవ్యమైన సంవత్సరం
క్రితమెన్నటికన్నా ఇప్పుడు ఎక్కువమంది ప్రజల దగ్గర బైబిలు ఉంది అని యునైటెడ్ బైబిల్ సొసైటీస్ నుంచి వచ్చిన ఒక నివేదిక తెలియజేస్తుంది. ఎందుకంటే, 1998 లో బైబిళ్ల పంపిణీ, క్రితం సంవత్సరంకన్నా ఐదు లక్షలకుమించి ఎక్కువగా పెరిగింది. మొత్తానికి, 58,50,00,000 బైబిళ్లు మొత్తంగానో భాగాలుగానో భూగోళ వ్యాప్తంగా పంపిణీ చేయబడ్డాయి. ఆ నివేదిక చెబుతున్నట్లు “ఇది ప్రోత్సాహానికి మూలంగా ఉంది. ఈనాడు అనేకమంది ప్రజలను దేవునివాక్యం చేరుకుంది.”
అయితే, బైబిలును కల్గివుండటానికి దాన్ని చదవటానికి తేడా ఉంది. ఉదాహరణకు ఒక సర్వేలో తేలినట్లుగా అమెరికన్లలో 90 శాతం మందికి వారి సొంత బైబిలు ఉంది, అంతేమంది బైబిలు నైతిక బోధలకు మంచి మూలమని నమ్ముతున్నారు కూడా. అయితే, 59 శాతం మంది మాత్రం సలహాకోసం బైబిలును తీస్తామని చెప్పారు. తమకు బైబిలు “మరీ అంతగా తెలీదు” లేక “అసలే తెలియదని” 29 శాతం మంది ఒప్పుకున్నారు.
యెహోవాసాక్షులు బైబిళ్లను ముద్రించి పంపిణీ చేయటం మాత్రమే కాదు 230 కన్నా ఎక్కువ దేశాల్లోని ప్రజలతో గృహబైబిలు పఠనాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇప్పుడు ఈ బైబిలు విద్యా కార్యక్రమం నుండి ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పుడు తామెదుర్కొంటున్న సమస్యలను అధిగమించటానికి వారు సహాయాన్ని పొందారు, దేవుని రాజ్యం క్రింద ఉజ్జ్వలమైన భవిష్యత్తు గురించి బైబిలు చెప్తున్నదాన్ని వాళ్లు నేర్చుకుంటున్నారు.—యెషయా 48:17, 18; మత్తయి 6:9, 10.
[32వ పేజీలోని చిత్రాలు]
బొలీవియా, ఘానా, శ్రీలంక, ఇంగ్లాండ్‌లలో గృహబైబిలు పఠనాలు (పైన ఎడమవైపు నుండి సవ్యదిశలో)