“నా రాజ్యమందిర సందర్శన”
ఒక మతసంబంధమైన కూటానికి హాజరై, తన అనుభవం గురించి ఒక నివేదిక వ్రాయమని లోరాa అనే కళాశాల విద్యార్థినికి నియామకం ఇవ్వబడింది. ఆమె యెహోవాసాక్షులను ఎంచుకుని, తన వ్యాసానికి “నా రాజ్యమందిర సందర్శన” అని పేరు పెట్టింది. లోరా, సాక్షుల గురించి భిన్నమైనది ఏం కనుగొంది? ఆమె పేర్కొన్న అనేక ఇతర విషయాలతోపాటు ఈ క్రింది విషయాలు కూడా ఉన్నాయి.
పిల్లలు: “పిల్లలందరూ పెద్దవారితోపాటు ఒకే గదిలో ఉన్నారు. నేను ఇంతవరకూ హాజరైన చర్చీలన్నిటిలోనూ, పిల్లలు తమ తల్లిదండ్రులను విడిచివెళ్లి సండే స్కూల్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.”
జాతిసామరస్యం: “సాధారణంగా, చర్చీలు ఒక ప్రత్యేకమైన జాతికి లేక వర్గానికి చెందిన సభ్యులనే ఆకర్షిస్తాయి. . . . అయితే, యెహోవాసాక్షులు వేర్వేరు గుంపులుగా కాక అందరూ కలిసి కూర్చున్నారు.”
ఆహ్వానించే స్ఫూర్తి: “చాలామంది నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడారు. . . . నేను ఎవరితోనైనా బైబిలు పఠిస్తున్నానా అని కూడా కొంతమంది నన్ను అడిగారు. అయినా వాళ్లు నన్ను ఒత్తిడి చేస్తున్నట్లు నేను భావించలేదు. వాళ్లు . . . నిర్ణయాన్ని నాకే వదిలేశారు.”
చందాల సేకరణ లేదు: “నన్ను నిజంగా ఆశ్చర్యపర్చిన ఒక వాస్తవం ఏమిటంటే, ఎవరూ చందాలు సేకరించలేదు. . . . నేను వెళ్లిన చర్చీలలో చివరికి పిల్లల తరగతులలో కూడా చందాలు వసూలు చేశారు.”
ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాలు దాదాపు 90,000 వరకు ఉన్నాయి. మీకు సమీపంలో ఉన్న ఒకదాన్ని ఎందుకు సందర్శించకూడదు?
[అధస్సూచి]
a ప్రత్యామ్నాయ పేరు.