కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 12/1 పేజీ 32
  • తల్లి ప్రేమ కన్నా గాఢమైన ప్రేమ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తల్లి ప్రేమ కన్నా గాఢమైన ప్రేమ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 12/1 పేజీ 32

తల్లి ప్రేమ కన్నా గాఢమైన ప్రేమ

భూగర్భ రైల్వే స్టేషన్‌లలోనూ, ప్రజా టాయ్‌లెట్లలోనూ, లేదా రద్దీగా ఉండే వీధుల్లోనూ, తల్లులు తమ నవజాత శిశువులను వదిలిపెడ్తున్నారు. కొన్నిసార్లు, చెత్తతీసుకువెళ్ళేవాళ్ళు తల్లి కోసం ఏడ్చి ఏడ్చి అలిసిపోయిన పసిబిడ్డలను చెత్త కుండీల్లో చూశారు. ఒ ఎస్టాడో డ ఎస్‌ పౌలో ప్రకారం, “వీధుల్లో పసిపిల్లలను వదిలేయడం చాలా ఎక్కువై పోతోంది.” చిన్న వయస్కులైన తల్లులు తాము తీసుకున్న నిర్ణయానికి తర్వాత నిజంగానే పశ్చాత్తాపపడుతుండవచ్చు. అయినా వాళ్ళలాగే చేస్తారు. అది తమ బిడ్డ ప్రాణానికి అపాయకరమైనా కూడా.

‘తన బిడ్డకు ఏం జరుగుతుందని కూడా ఆలోచించకుండా అలా వదిలేయాలన్న తలంపు తల్లికి ఎలా వస్తుంది?’ అని మీరనుకోవచ్చు. తన సొంత ప్రజలను గురించి సృష్టికర్తకున్న అనుభూతులకున్న గొప్ప తేడాను తెలియజేసేందుకు బైబిలు ఇలాంటి విచారకరమైన పరిస్థితిని రూపకాలంకారంగా ఉపయోగిస్తూ, “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను” అని దేవుడు మాటిస్తున్నాడని చెబుతుంది.—యెషయా 49:15.

నిజమే, మరే మానవ తల్లికన్నా ఎక్కువగా దేవుడికే మనమంటే ప్రగాఢమైన ప్రేమ. ఆయన మన అవసరాలకు ప్రతిస్పందిస్తాడు. మీరు చిన్నవాళ్లైనా, పెద్దవాళ్ళైనా సరే, మీకు ఏ సమస్య ఎదురైనా మీరు ఒంటరివారు కాదు. మీకు సహాయం చేయాలని మీ సృష్టికర్తకుంది. ఆయనకు మీ క్షేమం విషయంలో ఆసక్తి ఉంది. కీర్తన రచయిత మాటల్లో చెబితే, “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.”—కీర్తన 27:10.

ప్రపంచవ్యాప్తంగా, కావలికోట, తేజరిల్లు! పత్రికలు “అద్వితీయ సత్యదేవుడైన” యెహోవా గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించిన జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఆ జ్ఞానాన్ని హృదయంలోకి తీసుకునేవారికి అది నిత్యజీవాన్ని కూడా ఇవ్వగలదు.—యోహాను 17:3.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి