కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 7/15 పేజీ 32
  • “ఐక్యతా సహోదరత్వాల మాదిరి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఐక్యతా సహోదరత్వాల మాదిరి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 7/15 పేజీ 32

“ఐక్యతా సహోదరత్వాల మాదిరి”

తన కుటుంబ సభ్యురాలిని పోగొట్టుకున్న దుఃఖాన్ని అనుభవించిన ఒక స్త్రీ, యెహోవాసాక్షులను గూర్చి అలా వర్ణించింది. ఆమె ఇలా వివరిస్తోంది:

“జర్మనీలోని ఫ్రీబర్గ్‌లోని సాక్షుల ఇటాలియన్‌ సంఘానికి నా కుటుంబం తరపునా, నా తరపునా నేను కృతజ్ఞతలు తెల్పాలనుకుంటున్నాను. మా అన్నయ్య ఆంటోన్య, ఆయన భార్య అన్నా తప్ప మా కుటుంబంలో ఎవరూ యెహోవాసాక్షులు కాదు. వారు ఎంపిక చేసుకున్న మతాన్నిబట్టి మేము వాళ్ల అభిప్రాయాన్ని ఎంతోకాలం విమర్శించాము, అయితే మేము దాన్ని ఎల్లప్పుడూ గౌరవించేవాళ్లం.

“అయితే మేమిప్పుడు మా మనస్సు మార్చుకోవాలి. వాస్తవానికి, మేము ఎంతమాత్రం ఎదురుచూడని సహోదరత్వ ప్రేమల మాదిరిని మేము చూశాము.

“దుఃఖకరంగా, మా వదిన ఒక రోడ్డు ప్రమాదంలో అకాల మరణానికి గురయ్యింది. మేము ఇటలీలో నివసిస్తున్నాము కాబట్టి, మేము మా అన్నయ్య ఆంటోన్యనూ ఆయన పిల్లలనూ వెంటనే వెళ్ళి ఓదార్చలేకపోయాము. అయితే సాక్షులైన సహోదరులు ఆయనకు సహాయం చేయడానికి వచ్చారు. వాళ్లు తమ సహచర్యంతోనూ, తమ మాటలతోనూ, తమ విశ్వాసంతోనూ, భౌతికంగా నైతికంగా ఆర్థికంగా మద్దతునిస్తూ ఆయనకు సహాయం చేశారు. నేను సంఘానికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపలేను గనుక, వారి ఐక్యతా సహోదరత్వాల మాదిరినిబట్టి మీ పత్రిక ద్వారా వారికి కృతజ్ఞతలు తెల్పాలని నేను కోరుకుంటున్నాను. వారి మాదిరిని మేమెన్నడూ మరచిపోము.”

దయతో కూడిన ఈ స్త్రీ వ్యాఖ్యలను మేము మెచ్చుకుంటున్నాము. ఆమె పేర్కొన్నట్లుగా, యెహోవాసాక్షులది అంతర్జాతీయ సహోదరత్వం. (1 పేతురు 2:17) ప్రేమ “పరిపూర్ణతకు అనుబంధమైన”దని తెలుసుకుని, వారు తమ మధ్య బలమైన ప్రేమానుబంధాలను వృద్ధిచేసుకుంటారు. (కొలస్సయులు 3:14) మనందరికీ ఎదురవగల ఎంతో దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా, యెహోవాసాక్షులు దేవుడ్ని, ఆయన ప్రజలను సన్నిహితంగా హత్తుకుని ఉంటారు.—సామెతలు 18:24; ప్రసంగి 9:11; యోహాను 13:34, 35.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి