కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 12/15 పేజీ 30
  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • యథార్థత మరియు స్వయంత్యాగ స్ఫూర్తికి మాదిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఎలీషా అగ్ని రథాల్ని చూశాడు మరి మీరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 12/15 పేజీ 30

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ప్రశంసించారా? అయితే, మీరు ఈ క్రింది ప్రశ్నలకు జవాబివ్వగలరేమో చూడండి:

◻ క్రైస్తవ యౌవనునికి విద్యాభ్యాసపు ప్రధాన సంకల్పమేమిటి?

విద్యాభ్యాసపు ప్రధాన సంకల్పం, ఓ యౌవనస్థున్ని యెహోవా యొక్క ప్రతిభావంతుడైన పరిచారకునిగా ఉండేలా సంసిద్ధంచేసేదై ఉండాలన్నదే. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు విద్యాభ్యాసాలన్నిటిలో కెల్లా ఎంతో ప్రాముఖ్యమైన విద్యాభ్యాసం ఆత్మీయ [ఆధ్యాత్మిక] విద్యాభ్యాసమే.—8/15, పేజీ 21.

◻ తోటి క్రైస్తవుని గంభీరమైన తప్పిదాన్ని గురించి పెద్దలకు నివేదించడానికి కారణాలు ఏవి?

తప్పిదాన్ని నివేదించడానికి గల ఒక కారణమేమిటంటే సంఘ పవిత్రతను కాపాడేందుకు అది పనిచేస్తుండడమే. మరొక కారణమేమిటంటే అది దేవుని ఎడలా, సంఘం ఎడలా, తప్పిదస్థుని ఎడలా సూత్రబద్ధమైన ప్రేమను చూపించే చర్యే.—8/15, పేజీలు 28, 30.

◻ ‘యెహోవా దినపు రాకడకొరకు . . . ఆశతో అపేక్షించడం’ అంటే భావం ఏమిటి? (2 పేతురు 3:12)

మనం ‘యెహోవా దినాన్ని’ మన మనస్సుల్లో నుండి తీసివేసుకోకూడదని భావం. యెహోవా ఈ విధానాన్ని నాశనం చేసే దినం సమీపంలో ఉందనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. మనకు ఎంతో సమీపంలో ఉందన్నంత స్పష్టంగా అది మనకు వాస్తవమైనదై ఉండాలి. (జెఫన్యా 1:7, 14)—9/1, పేజీ 19.

◻ ఈ విధానం యొక్క అంత్యదినాలు అనేకులు అపేక్షించిన దానికన్నా ఎక్కువకాలం ఎందుకు కొనసాగుతున్నాయి?

మానవజాతికంతటికీ ఏది శ్రేష్ఠమో దాన్ని యెహోవా పరిగణనలోకి తీసుకుంటాడు. ప్రజల జీవితాల గురించి ఆయన శ్రద్ధ కల్గివున్నాడు. (యెహెజ్కేలు 33:11) సంపూర్ణ జ్ఞానవంతుడైన, ప్రేమగల మన సృష్టికర్త సంకల్పం నెరవేర్చడానికి సరిగ్గా తగిన సమయంలో అంతం వస్తుందని మనం నిశ్చయత కల్గివుండవచ్చు.—9/1, పేజీ 22.

◻ పూర్తికాల సేవలో ఉన్నవారు సమస్యలు ఎదుర్కోవల్సి వచ్చినప్పటికీ వాళ్లు తమ ఆనందాన్నెలా కాపాడుకోగలరు?

తమకున్న అనేక దీవెనలను గురించి ఆలోచించి, వేలాదిమంది ఇతరులు అంతకన్నా ఎక్కువ కష్టాలను అనుభవిస్తున్నారని గుర్తించాలి. (1 పేతురు 5:6-9)—9/15, పేజీ 24.

◻ బైబిల్ని అనువదించడంలో విలియం టిండేల్‌ లక్ష్యం ఏమిటి?

సామాన్యుడికి సాధ్యమైనంతలో కచ్చితమైన, సుళువైన భాషలో లేఖనాలను అందుబాటులో ఉంచడమే టిండేల్‌ లక్ష్యం.—9/15, పేజీ 27.

◻ దేవుని వాక్య యథార్థ ప్రచారకులమని మనమెలా చూపించుకుంటాం?

ఇతరులకు దాన్ని ఆసక్తిదాయకంగా ప్రకటించడం ద్వారా దేవుని వాక్యం ఎడలగల మన యథార్థతను చూపించుకుంటాం. అది చెబుతున్న వాటిని మన అభిప్రాయాలకు సరిపడేలా ఎన్నడూ వక్రీకరించకుండా లేక సాగదీయకుండా, బోధకులుగా మనం బైబిల్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. (2 తిమోతి 2:15)—10/1, పేజీ 20.

◻ విషపూరితమైన లౌకికాత్మ మన విశ్వాస్యతను ఎలా బలహీనపర్చగలదు?

మనం కలిగివున్న వాటి విషయంలో మనం అసంతృప్తి కలిగి ఉండేలా మరియు మన అవసరతలూ ఆసక్తులను దేవునికంటే ముందుగా ఉంచేలా చేయడం ద్వారా మన విశ్వాస్యతను లౌకికాత్మ బలహీనపర్చగలదు. (మత్తయి 16:21-23 పోల్చండి.)—10/1, పేజీ 29.

◻ యెహోవాకు మనస్ఫూర్తిగా సేవచేయడం అంటే ఏమిటి?

“మనస్ఫూర్తిగా” అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “ప్రాణం నుండి” అని అర్థం. “ప్రాణము” ఒక వ్యక్తి యొక్క భౌతిక, మానసిక సామర్థ్యాలతోపాటు ఆ పూర్తి వ్యక్తిని సూచిస్తుంది. మనస్ఫూర్తిగా యెహోవాకు సేవచేయడం అంటే దేవుని సేవలో మన సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తూ, మన శక్తులను సాధ్యమైనంత పూర్తి మొత్తంలో ఉపయోగిస్తూ మనలను మనం అర్పించుకోవడం అని అర్థం. (మార్కు 12:29, 30, NW)—10/15, పేజీ 13.

◻ దైవిక సూత్రానుసారిగా ఉండేందుకు కీలకం ఏమిటి?

నిజానికి యెహోవాను, ఆయన ఇష్టాయిష్టాలనూ, ఆయన సంకల్పాలను తెలుసుకోవడమే కీలకం. దేవుని గూర్చిన ఈ ప్రాథమిక విషయాలు మన జీవితాలను శాసిస్తే అవి సజీవ సూత్రాలుగా మారుతాయి. (యిర్మీయా 22:16; హెబ్రీయులు 4:12)—10/15, పేజీ 29.

◻ యెహోవా సేవకులు మానవ పరిపాలనాధిపత్యం ఎడల ఏ సమతూకమైన వైఖరిని కల్గివున్నారు?

వాళ్లు దేవుని రాజ్య రాయబారులుగా లేక ప్రతినిధులుగా సేవచేస్తున్నారు గనుక రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉంటారు. (2 కొరింథీయులు 5:20) మరోవైపున, అధికారంలో ఉన్నవారి ఎడల వారు తమ మనస్సాక్షినిబట్టి విధేయత చూపిస్తారు.—11/1, పేజీ 17.

◻ ఎలీషా ప్రవక్త చేపట్టిన దానినుండి మనమే పాఠాన్ని నేర్చుకోగలం?

ఏలియాతోపాటు ప్రత్యేక పనికై ఆహ్వానం ఇవ్వబడినప్పుడు, తాను చేయాల్సిన పనులలో కొన్ని హీనమైనవైనప్పటికీ, ఏలియాకు పరిచారము చేయడానికి ఎలీషా తన పొలమును వెంటనే విడిచివచ్చేశాడు. (2 రాజులు 3:11) దూర ప్రాంతాలలో రాజ్య సువార్తను ప్రకటించడానికి తమ జీవనాధారాలను విడిచిపెట్టి ముందుకు రావడం ద్వారా, నేడు దేవుని సేవకులలో అనేకులు అటువంటి స్వయంత్యాగ స్ఫూర్తిని కనపరుస్తున్నారు.—11/1, పేజీ 31.

◻ ఏ ప్రయోజనకర సలహాను యాకోబు పత్రిక కల్గివుంది?

ఇది శోధనల్ని ఎలా ఎదుర్కోవాలో మనకు చూపిస్తుంది, పక్షపాతాన్ని చూపించడానికి వ్యతిరేకంగా మనకు సలహాల్ని ఇస్తుంది, నీతియుక్తమైన పనుల్లో పాల్గొనాలని మనకు ఉద్బోధిస్తుంది. నాలుకను అదుపులో ఉంచుకోమనీ, లోకసంబంధమైన ప్రభావాన్ని ఎదుర్కోమనీ, శాంతిని పెంపొందించమనీ మనకు యాకోబు ఉద్బోధిస్తున్నాడు. ఆయన మాటలు మనల్ని సహనమూర్తులుగానూ, ప్రార్థనాపరులుగానూ కూడా చేస్తున్నాయి.—11/15, పేజీ 24.

◻ యెహోవా ‘క్షమించడానికి’ ఎందుకు ‘సిద్ధంగా’ ఉన్నాడు? (కీర్తన 86:5)

మనం మంటినుండి తీయబడిన ప్రాణులమన్న విషయాన్ని—అపరిపూర్ణత ఫలితంగా మనం నిర్బలులమన్న విషయాన్ని, బలహీనులమన్న విషయాన్ని—యెహోవా మర్చిపోడు గనుక ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. (కీర్తన 103:12-14)—12/1, పేజీలు 10, 11.

◻ మనం ఇతరులను క్షమించడానికి ఎందుకు సుముఖంగా ఉండాలి?

జాలిని కనుపర్చడానికి ఆధారమున్నా మనం ఇతరులను క్షమించడానికి నిరాకరిస్తే, అది దేవునితో మన స్వంత సంబంధం మీద తీవ్ర ప్రభావం చూపగలదు. (మత్తయి 6:14, 15)—12/1, పేజీ 17.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి