కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 10/15 పేజీ 31
  • కన్యాత్వపు వివాహమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కన్యాత్వపు వివాహమా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 10/15 పేజీ 31

కన్యాత్వపు వివాహమా?

మరియ యోసేపుతో వివాహమైన తర్వాత కూడా నిత్య కన్యకేనన్న వాదాన్ని ఒప్పింపజేసే ప్రయత్నంలో కొందరు చిత్రకారులూ, శిల్పులూ యోసేపును వయస్సు మళ్ళినవానిగా చిత్రీకరించారు. నిజానికి యోసేపు మరియకు భర్త అనే దానికన్నా ఎక్కువగా సంరక్షుడుగానే ఉండేవాడని వారు తర్కిస్తారు. కానీ పోప్‌ జాన్‌ పాల్‌ II ఇటీవలే ఈ విషయంలో విభిన్న దృక్కోణాన్ని తెలియజేశాడు. యోసేపు “అప్పట్లో వయస్సు మళ్ళినవాడు కాదు” కానీ, “యోసేపు అంతర్గత పరిపూర్ణతా, దేవుని కృపా మూలంగా తమ వివాహ జీవితంలో లైంగిక కోరిక లేకుండా మరియతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండేందుకు ఆయన ప్రభావితుడయ్యాడు” అని ఆయన అభిప్రాయపడ్డాడు.

మరియ నిత్య కన్యకగా ఉండదలచుకున్నట్లయితే పెళ్ళి నిశ్చయానికి ఎందుకు ఒప్పుకున్నట్లు? “వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు, కన్యకగా జీవించాలనే ఉద్దేశాన్ని గురించి వాళ్ళిద్దరి మధ్యా పరస్పర అవగాహన ఏర్పడి ఉండవచ్చని ఊహించుకోవచ్చు” అని పోప్‌ జవాబిస్తున్నాడు.

అయినప్పటికీ, బైబిలు ఈ విషయాన్ని భిన్నంగా చెబుతుంది. “కుమారుని ప్రసవించునంతవరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు” అని మత్తయి వృత్తాంతం చెబుతుంది. (మత్తయి 1:25, క్యాతలిక్‌ అనువాదము, ఇటాలిక్కులు మావి.) యేసు జననం తర్వాత, మరియ యోసేపుల వివాహ బంధం కన్యాత్వంగానే ఉండిపోలేదు. యేసుకు సహోదరులూ సహోదరీలు ఉన్నారని తర్వాత సువార్త వృత్తాంతంలో చూపించబడిందన్నదే అందుకు రుజువు.—మత్తయి 13:55, 56.

అలా, మరియ యేసుకు జన్మనిచ్చినప్పుడు కన్యకగానే ఉన్నదని బైబిలు చెబుతున్నప్పటికీ, యోసేపుతో తన శేషజీవితంలో ఆమె కన్యకగానే జీవించింది అని వాదించడానికి ఆధారమేమీ లేదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి