‘మనకు నిజాయితీగల ప్రజలు అవసరం’
నేటి ప్రపంచంలో యథార్థత అరుదు. అయినప్పటికీ, క్రైస్తవులకు అది ఒక ప్రాథమిక అవసరత. పౌలు ఇలా వ్రాశాడు: “మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింపగోరుచు”న్నాము. (హెబ్రీయులు 13:18) ఇటలీలోని ఫాయెన్జా నందలి యెహోవాసాక్షుల్లో ఒకరైన విల్మా అదే చేయాలని అనుకుంది.
తానువున్న నగరంలోని సూపర్‌మార్కెట్ బయట చాలా మొత్తం డబ్బు ఉన్న ఒక పర్సును ఆమె కనుగొన్నప్పుడు దాని యజమానికి దాన్ని ఇచ్చేందుకు పోలీసులకు ఆ పర్సును “నిస్సంకోచంగా” ఇచ్చేసిందని ఎల్ రెస్టో డెల్ కార్లెనో అనే వార్తాపత్రిక చెబుతుంది.
మేయర్ ఈ విషయాన్ని గురించి విన్నప్పుడు, అతడు విల్మాకు కృతజ్ఞతా వచనాన్ని తెలిపే క్లుప్త లేఖను వెంటనే పంపించాడు. “పట్టణం తరఫున నేను మీకు ఈ ఉత్తమ చర్య విషయమై హృదయపూర్వకంగా వందనాలు చెబుతున్నాను. మన ఘనమైన ఫాయెన్జా నగరానికి మంచితనం, నిజాయితీగల ప్రజలు అవసరమని” ఆయన వ్రాశాడు.
మంచి పనులు గుర్తించబడినా గుర్తించబడక పోయినా, మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండేందుకు కృషి చేయాలి. పరిశుద్ధ లేఖనాలు ప్రోత్సహిస్తున్న విధంగా, “ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.”—2 కొరింథీయులు 8:21.