అన్నీ పవిత్ర గ్రంథాలేనా?
పరిశుద్ధ బైబిలును ప్రేరేపించిన దేవుని ఆత్మ, పరిశుద్ధమైనవని కొందరు పరిగణించే ఇతర పుస్తకాలు వ్రాయబడేందుకు కూడా కారణం కాగలదా? (2 తిమోతి 3:16) “[వాటికన్] సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ పర్యవేక్షణలో” ప్రచురింపబడుతూ, కాథోలిక్‌ల ద్వారా అధికారిక పత్రికగా పరిగణింపబడుతున్న ఒక ఇటాలియన్ జెస్సూట్ పత్రిక (లా సీవీల్టా కాటోలేకా) ఈ ప్రశ్నను లేవనెత్తింది.
“దేవుడు తన పరిశుద్ధాత్మ చర్య ద్వారా, వాక్యపు విత్తనాలు యూదయేతర మరియు క్రైస్తవేతర పారంపర్యాల పరిశుద్ధ గ్రంథాలలో కొన్నింటినందు కూడా వెదజల్లబడేలా చేశాడు” అని ఆ జెస్సూట్ పత్రిక చెబుతుంది. జొరాస్ట్రియన్ మతానికి చెందిన అవెస్టా లేక కన్‌ఫ్యూజియానిజానికి చెందిన ఫోర్ బుక్స్ వంటి “పరిశుద్ధ” గ్రంథాలు, “పరిశుద్ధాత్మ యొక్క ఏదో కొంత ప్రభావం లేకుండా” వ్రాయబడలేదనీ “అందును బట్టి కొంత మేరకు అవి ‘దైవిక ప్రకటనలను’ కలిగి ఉన్నాయనీ” జెస్సూట్‌లు భావిస్తున్నారు.
అయితే, ఆ శీర్షిక ఇలా సంజాయిషీ ఇస్తుంది. ఈ గ్రంథాలను వ్రాసిన వారు, తాము ఏ కాలంలో జీవించి, మనుగడ సాగించారో ఆ కాలంనాటి “బహు దేవతారాధనా పర్యావరణం లేక తాత్విక పర్యావరణం యొక్క ప్రభావాన్ని అనుభవించి ఉంటారు” గనుక “అలాంటి పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్న ప్రతి మాటలూ దేవుని వాక్కులు కావు.” లా రెపబ్లికా అనే ఇటాలియన్ వార్తాపత్రిక కొరకు వాటికన్ అఫైర్స్ కరస్పాండెంట్ అయిన మార్కో పాలీటీ ప్రకారం, ఈ అభిప్రాయం “కాథోలిక్ మరియు గొప్ప చరిత్రగల మతాల మధ్య మునుపు అసాధ్యమనుకున్న సంబంధబాంధవ్యాలను సుగమం చేస్తుంది.” జాన్ పాల్ ll ఎంతో ఉత్సాహంగా ప్రేరేపించగా, 1986లో అసిస్సీనందు జరిగిన విభిన్న మతాంతర ప్రార్థనాకూటాల స్ఫూర్తిని అది మళ్లీ పురికొల్పుతుంది.
యెహోవా అల్లరిని మరియు గలిబిలిని కలిగించే దేవుడు కాదు. (1 కొరింథీయులు 14:33) ఆయన పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తి, ఆయన వాక్యమైన బైబిలుతో ఏ మాత్రం పొందికలేని ఏ పుస్తకాల్లోనైన్నా ఏ కొంత భాగాన్నైనా ప్రేరేపిస్తుందని మనం తేల్చి చెప్పడం ఎంతమాత్రం సరికాదు. విభిన్న “మత పారంపర్యాచారాల” మధ్య సర్వసాధారణ సంప్రదింపులను ప్రోత్సహించే బదులు, “యొక్కటే నిరీక్షణ . . . ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే” ఉందని క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.—ఎఫెసీయులు 4:4, 5.
ఉన్న ఆ ‘ఒకే నిరీక్షణ’ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడంపై ఆధారపడి ఉంది. బైబిలు సరిగ్గా ఇలా పేర్కొంటుంది: “మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.” (అపొస్తలుల కార్యములు 4:12) దేవుని సంకల్పం నెరవేరే విషయంలో యేసు ఎంతో ముఖ్యమైన వ్యక్తియని మరే ఇతర “పరిశుద్ధ గ్రంథమూ” చూపడం లేదు. మనం బైబిలును దేవుని వాక్యంగా అంగీకరిస్తేనే, రక్షణ కొరకైన యెహోవా దేవుని ప్రేమపూర్వక ఏర్పాటును గురించి అది మనకు నేర్పించగలదు.—యోహాను 17:3; 1 థెస్సలొనీకయులు 2:13.