“వారిని గెంటివెయ్యకండి!”
“యెహోవాసాక్షులలో ఒకరుగాని ఇద్దరుగాని మీ కాలింగ్ బెల్‌ని కొడితే వారిని గెంటివెయ్యకండి!” అని కోర్యర్ డాల్లా సేరా సలహానిస్తోంది. ఈ వార్తాపత్రిక, ఉత్తర ఇటలీలోని ట్రావీజోనందు జరిగిన ఓ సంఘటనను తెలియజేస్తోంది, అక్కడ ఓ వ్యాపారవేత్త తనను సందర్శించ వచ్చిన ఇద్దరు సాక్షుల్ని గెంటివేయడంవల్ల పది లక్షల లైరాలకుపైగా (600 అమెరికన్ డాలర్లకుపైగా) పోగొట్టుకునే రిస్కును తీసుకోవాల్సి వచ్చింది.
వార్తాపత్రిక చెప్పిన ప్రకారంగా, ఆ ఇద్దరు సాక్షులూ “ఈ రోజు మీకు మంచిరోజు. మేము యెహోవాసాక్షులం, మీకు ఇవ్వడానికి మా దగ్గర కొంత విలువైనదుంది” అనే మాటలతో ఆ వ్యక్తికి తమ్మును పరిచయం చేసుకున్నారు. దానికి, ఆ స్నేహశీలికాని వ్యాపారవేత్త వారు చెప్పే విషయాన్ని ముగించనివ్వకుండానే తలుపు వేసేశాడు.
ఆ వ్యక్తి గనుక వినినట్లైతే, ఆ సాక్షులు తమకు పార్కు బెంచిపై దొరికిన అతని కేష్‌బేగ్‌ను ఇవ్వడానికి అతనింటికి వచ్చారని తెల్సుకుని ఉండేవాడు. కాబట్టి సాక్షులు దానితోవున్న వాటితోపాటు ఆ కేష్‌బేగ్‌ను సమీపానవున్న పోలీస్ స్టేషన్‌లో ఇవ్వడం మినహా ఏం చెయ్యలేకపోయారు. ఆ మరుసటి రోజు, పోలీసులు దాని యజమానికి దానిని తిరిగి ఇచ్చేశారు.
“ఆ అసఫలులైన ఇరువురి [సాక్షుల] స్థానంలో మరెవరైనా ఉంటే, వాడు బహుశా . . . ఆ కేష్ బేగ్‌లోని పెద్ద మొత్తాన్ని తస్కరించేవాడే. కాని పూర్తిగా నిజాయితీపరులైన యెహోవాసాక్షులు తస్కరించరు” అని ఈల్ గాసెటీనో డీ ట్రావీజో తెలియజేసింది.
“పూర్తిగా నిజాయితీపరులుగా” ఉండడానికి యెహోవాసాక్షుల్ని ఏది ప్రేరేపించింది? యేసు బోధల ప్రకారం దేవుని ఎడల, పొరుగువారి ఎడలగల వారి ప్రేమే. (మత్తయి 22:37-39) అందునుబట్టే యెహోవాసాక్షులు యెహోవా దేవుడు వాగ్దానం చేసిన అద్భుతకరమైన “క్రొత్త భూమి”ని గూర్చిన సువార్తను ప్రకటించడానికి ఇంటింటికి వెళ్తున్నారు. అలాంటి నిరీక్షణా సందేశం ఎటువంటి వస్తు సంపదను కల్గివుండడానికన్నా యోగ్యమైంది!—2 పేతురు 3:13.