తమ మహాగొప్ప స్నేహితునివల్ల కాపాడబడడం
యెహోవాసాక్షులను ఒక స్నేహబంధం ప్రత్యేకంగా కాపాడుతుంది. అది, వారి మహాగొప్ప స్నేహితుడైన యెహోవా దేవునితోనున్న వారి ప్రశస్తమైన స్నేహబంధం. (యాకోబు 2:23 పోల్చండి.) పెద్ద విశ్వాస పరీక్షల్లో వారికి ఆయన మద్దతునిస్తాడు.
ఏకపక్షపరిపాలనల్లో సాక్షులు చూపించిన యథార్థతా చరిత్రను చాలా మంది పరిశీలకులు ప్రశంసించారు. కమ్యూనిస్టు నిర్బంధ శిబిరాల్లో చాలా సంవత్సరాలు గడిపిన తరువాత, 1968లో జెకోస్లోవాకియా నుండి వలసవెళ్ళిన తత్వశాస్త్రంలోను ప్రకృతి విజ్ఞానశాస్త్రంలోను పండితుడైన ఇరీ క్రుపిక వారిలో ఒకడు. రినెస్సాన్స్ రొజుము (మేధావుల పునర్జాగరణ) అనే తన పుస్తకంలో అతడు తమ తటస్థవైఖరినిబట్టి జైలులో వేయబడిన సాక్షుల బాధలను గూర్చి స్థయిర్యాన్ని గూర్చి వ్యాఖ్యానించాడు.
కమ్యూనిస్టు ప్రభుత్వంలో, చాలా మంది సాక్షులు తమ విశ్వాసాన్నిబట్టి కారాగారంలో వేయబడ్డారు. కారాగారంలో వేయబడినప్పటికీ, యుద్ధంలో ఉపయోగించేందుకైన యురేనియాన్ని త్రవ్వడానికి వారు నిరాకరించారు. (యెషయా 2:4) 1952లో తాను సందర్శించిన ఒక గనిలో తాను చూసిన ఒక దృశ్యాన్ని క్రుపికా వర్ణిస్తున్నాడు. విపరీతమైన చలిలో రెండు ఆకారాలు మంచు ప్రతిమల్లా నిలబడడాన్ని చూశాడు. లోహ పీపాలతో వారి తలలు మరియు శరీర పైభాగం కప్పబడి ఉన్నాయి.
క్రుపికా ఇలా వ్రాస్తున్నాడు: “వారిని పెందలకడనే చినిగిన జైలు దుస్తుల్లో బయటకు పంపించే వారు. బిగుసుకుపోయిన కాళ్ళతో వాళ్ళు అంత సేపు ఎలా తట్టుకొని నిలబడగలిగారు? విశ్వాస బలం వల్లే. పీపాలు పాతవి మరియు తుప్పు పట్టినవి. క్రూరుడైన ఒక వ్యక్తి వారి తలమీద భుజాల మీద బలంగా కొట్టడంతో పదునుగా ఉన్న పీపా అంచు భాగం వారిలో ఒకరి జాకెట్ గుండా చర్మంలోకి దిగగా, జాకెట్ చేతుల నుండి రక్తం కారుతూ ఉండింది.
“ఒక గార్డు మా గుంపును వారి ముందు ఆపాడు, మరి కమాండరు మాకో చిన్న ప్రసంగమిచ్చాడు. పనిచేయడానికి నిరాకరించడమనేది తిరుగుబాటుతనం, దానికి తగ్గట్లు శిక్షవేయబడుతుందని ఆయన అన్నాడు. సామ్యవాదానికి శత్రువులును యుద్ధ వ్యతిరేకులునైన వీరిని యుద్ధాన్ని గూర్చిన, చంపుకోవడాన్ని గూర్చిన భావోద్రేకంతో కూడిన వ్యర్థప్రలాపాలు సహాయపడలేవు.”
కమాండర్ ఒక లోహపు ముక్కను తీసుకుని ఆ పీపాల్లో ఒక దానిని కొట్టాడు. తలపై ఉన్న పీపాతోపాటే ఆ మనిషి కుప్పకూలిపోయాడు. తరువాత జరిగిన విషయం క్రుపికా మనస్సులో లోతుగా పాతుకుపోయింది.
ఆయన ఇలా చెబుతున్నాడు: “పీపాల నుండి పాట వస్తోంది. సన్నని స్వరాలు, దేనినైనా, ఎక్కడి నుండైనా వినగల అంటే, పాత తుప్పు పట్టిన యురేనియమ్ పీపాల నుండి పాడడానికి ప్రయత్నం చేయడం కూడా వినగల దేవునికి నెమ్మదిగా ప్రార్థన చేయడం వినబడింది. ఓ పెద్ద కథీడ్రల్లో పాడబడే ప్రార్థనగీతానికన్నా పెద్దగా ఆయనకు అది వినిపిస్తుంది.”
1993 సెప్టెంబరు 1,న చెక్ రిపబ్లిక్లో యెహోవాసాక్షుల పనికి అధికారికంగా చట్టబద్ధమైన గుర్తింపు దొరికింది. చెక్ సాక్షులు తమ క్రైస్తవ విద్యాపనిని స్వాతంత్ర్యంతో కొనసాగించడంలో ఇప్పుడు ఆనందిస్తున్నారు. అవును, వారు తమ గొప్ప స్నేహితుడైన యెహోవాను గూర్చి ఇతరులకు చెప్పడంలో సంతోషిస్తారు.
[7వ పేజీలోని చిత్రం]
చెక్ రిపబ్లిక్లోని సమావేశితులు