కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 2/1 పేజీ 3
  • మీరు రక్షణ పొందారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు రక్షణ పొందారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • రక్షణ పొందడానికి మనం ఏమి చేయాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • రక్షణ నిజంగా దాని భావమేమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యేసు రక్షిస్తాడు—ఎలా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ‘ఒకసారి రక్షణ పొందితే, శాశ్వతంగా రక్షణ పొందినట్లే’ అని బైబిలు చెప్తోందా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 2/1 పేజీ 3

మీరు రక్షణ పొందారా?

ఒక వ్యక్తి జానీని సంతలో ఆపి, “యౌవనుడా, నీవు యేసు క్రీస్తును నీ ప్రభువుగా, రక్షకునిగా అంగీకరిస్తున్నావా?” అని అడిగినప్పుడు ఆయన పదేళ్లవాడు. జానీ ఎప్పుడూ యేసును నమ్మాడు గనుక ఆ ప్రశ్న ఆయనకు కొంత వింతగా అనిపించింది. కాబట్టి “అవును, నేను విశ్వసిస్తున్నాను” అని ఆయన సమాధానమిచ్చాడు. అందరికీ వినిపించేలా ఆ వ్యక్తి ఇలా అరిచాడు: “ప్రభువుకు స్తోత్రం! మరో ప్రాణం క్రీస్తు కొరకు రక్షణ పొందాడు!”

రక్షణ నిజంగా అంత సులభమా? తన మిగతా జీవితంలో జానీ ఇక ఏమి చేయబోయినప్పటికి, ఆ మాటలు చెప్పిన క్షణం నుండి ఆయన “రక్షణ” పొందినట్లేనా? యథార్థవంతులైన అనేకులు అవునని సమాధానమిస్తారు. మీరు “రక్షణ” పొందిన తేదీని గుర్తుంచుకొనేలా దాన్ని వ్రాసి ఉంచుకోమని కొన్ని మతసంబంధమైన కరపత్రాలు చెబుతాయి.

“క్రీస్తునందు నామమాత్రంగా విశ్వాసం ఉంచిన క్షణంలోనే, . . . ఒకరి గమ్యం శాశ్వతంగా తీర్మానించబడుతుంది” అని ఒక మతనాయకుడు వ్రాశాడు. రక్షణ అన్నది ఒక్కసారి “విశ్వసించడమనే చర్యపై” ఆధారపడి ఉంటుందిగాని “విశ్వాసమందు కొనసాగడంపై కాదని” బైబిలు చెబుతుందని అతడన్నాడు. మరో మత రచయిత ఇలా వ్రాశాడు: “ఇది ఒక ముగిసిన క్రియ. అది మీ కొరకు ఇప్పటికే సాధించబడింది . . . మీ ‘పోరాటం అంతమయ్యింది.’ మీ ‘పాపం తీసివేయబడింది.’” కాని ఇది నిజమని కచ్చితంగా ఒప్పింపబడిన ప్రజలు కూడా ఇక్కడ ఒక సమస్యను చూడవచ్చు. వారు “రక్షణ” పొందారని ఎవరికైతే చెప్పబడిందో ఆ అనేకమంది ప్రజలు, వారు ఏ విధంగా జీవించాలని బైబిలు చెబుతుందో ఆ విధంగా జీవించడం లేదన్నది స్పష్టమే. ఒక సాధారణ వివరణ ఏమిటంటే, బహుశా వారు క్రీస్తును నిజంగా “అంగీకరించ” లేదేమోనన్నదే.

కాబట్టి, యేసును నిజంగా “అంగీకరించడం” అంటే ఏమిటి? అది విశ్వాసం విషయంలో ఒకసారి తీసుకొనే చర్యేనా లేక అది కొనసాగే జీవిత విధానమా? మన నమ్మకం చర్య గైకొనడానికి మనల్ని పురికొల్పేంత బలంగా ఉండాలా? మనం యేసును అనుసరించే బాధ్యతను అంగీకరించకుండానే ఆయన బలి ప్రయోజనాల్ని నిజంగా అంగీకరించగలమా?

అనేకమంది ప్రజలకు ఆశీర్వాదాలు కావాలి గాని యేసును అనుసరించి విధేయత చూపడమనే బాధ్యత అవసరంలేదు. వాస్తవానికి, “విధేయతచూపడం” అనే పదం తరచూ వారిని కలతపరుస్తుంది. అయినప్పటికీ యేసు, “నీవు వచ్చి నన్ను వెంబడింపుమని” చెప్పాడు. (లూకా 18:18-23) మరియు బైబిలు ఇలా చెబుతుంది: “మన ప్రభువైన యేసు సువార్తకు లోబడనివా[రు] . . . నిత్యనాశనమను దండన పొందుదురు.”—2 థెస్సలొనీకయులు 1:8-10; మత్తయి 10:38; 16:24.

రక్షణ గురించి బోధింపబడిన దాన్ని గూర్చి గంభీరమైన ప్రశ్నలను రేకెత్తించే అనేక విషయాలను బైబిలు చెబుతుంది. ఈ విషయంపై బైబిలు నిజంగా ఏమి చెబుతుందో పరిశీలించాలని మీరు ఇష్టపడితే, తర్వాతి పేజీలు మీకు ప్రాముఖ్యంగా ఆసక్తిదాయకమైనవిగా ఉంటాయి. ఈ ప్రాముఖ్యమైన విషయం గురించి యేసు మరియు ఆయన శిష్యులు ఏమి బోధించారో చూడడానికి మీ బైబిలును తెరిచి, ఉదాహరింపబడిన లేఖనాలను చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి