యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా ఆరోపించబడిన కేసు తీర్మానించబడింది
పదే పదే వాయిదా వేయబడిన తర్వాత, యెహోవాసాక్షులైన నలుగురు స్త్రీలకు వ్యతిరేకంగావున్న కేసును వినడానికి, గ్రీసులోని థెస్సలొనీక నందలి అప్పీలు కోర్టు చివరికి 1995, జూన్ 8న సమావేశమైంది. వారికి వ్యతిరేకంగా చేయబడిన ఆరోపణ ఏమిటి? అదేమిటంటే, ఐదుకంటే ఎక్కువ దశాబ్దాల నుండి గ్రీకు చట్టం నిషేధించిన మతమార్పిడే.
అయితే, కోర్టు సమావేశమయ్యే సమయానికి, నిందకు ముఖ్య సాక్షి—నలుగురు స్త్రీలకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసిన ప్రీస్టు—చనిపోయాడు. మరో ప్రీస్టు అతని స్థానంలో సాక్ష్యమివ్వాలని ప్రయత్నించాడు కాని కోర్టు అతని విజ్ఞప్తిని అంగీకరించలేదు. కాబట్టి, విచారణ కేవలం 15 నిమిషాలు మాత్రమే జరిగిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు! ఆరోపిస్తున్న ఇతర సాక్షులను కూడా పరిశీలించి, ప్రతివాదులు చట్టవ్యతిరేకమైన మతమార్పిడి అనే అపరాధం చేయలేదని న్యాయమూర్తి కనుగొన్నాడు. మానవహక్కుల ఐరోపా కోర్టు 1993లో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి, లోబడివుండడానికి గ్రీకు కోర్టులు సుముఖంగా ఉన్నాయని ఈ నిర్ణయం సూచిస్తుంది.
ఆరోపణ గురించి సాక్ష్యమివ్వడానికి వచ్చిన ముగ్గురు స్త్రీలు సాక్షులైన ప్రతివాదులను సమీపించి, వారిని హృదయపూర్వకంగా అభినందించడం ముఖ్యంగా ఆశ్చర్యం కల్గించేదిగా ఉండెను. వారిలో ఒకామె “ఈ జరిగిన వాటన్నిటికీ మేము క్షమాపణ చెప్పుకుంటున్నాము” అని చెప్పింది. ఇంకా ఆమె ఇలా అన్నది: “అది మా తప్పు కాదు. మీపై నిందారోపణ చేయమని ప్రీస్టు మమ్మల్ని బలవంత పెట్టాడు. అతడు ఇప్పుడిక లేడు గనుక, మీరు మా గ్రామానికి, మా ఇళ్లకు రావాలని మేము కోరుకుంటున్నాము.”
అలా, యెహోవా గ్రీసులో మరొకసారి తన ప్రజలకు అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించాడు. గ్రీసునందు 1938 మరియు 1939లలో మతమార్పిడి చట్టాలు విధించబడ్డాయి. యెహోవాసాక్షులను హింసించడం తప్పని నిరూపించడానికి 1993లో మానవహక్కుల ఐరోపా కోర్టు ఈ చట్టాన్ని ఉపయోగించింది.—కావలికోట 1993, సెప్టెంబరు 1, 27-31 పేజీలు చూడండి.