కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 11/15 పేజీలు 24-25
  • వారి దీపం ఆరిపోలేదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వారి దీపం ఆరిపోలేదు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • యిర్మీయావలె ధైర్యంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ప్రకటించడానికి యెహోవా యిర్మీయాను పంపిస్తాడు
    నా బైబిలు పుస్తకం
  • యిర్మీయా గ్రంథములోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యెహోవా గురించి మాట్లాడడం మానని యిర్మీయా
    చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 11/15 పేజీలు 24-25

వారి దీపం ఆరిపోలేదు

ఆటంకాలను, కష్టాలను అనుభవించిన యెహోవా యొక్క నమ్మకస్థులైన సాక్షులు బైబిలు కాలాల్లో ఉండేవారు. వారు వ్యతిరేకతను, వైఫల్యాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారు నిరుత్సాహంతో చేతులెత్తేయలేదు. మరోలా చెప్పాలంటే, వారి దీపం ఆరిపోలేదు.

ఉదాహరణకు, మతభ్రష్ట యూదా జనాంగానికి దేవుని ప్రవక్తవలె ఉండేందుకు ప్రవక్తైన యిర్మీయాకు నియామకం ఇవ్వబడింది. యెరూషలేముపై రాబోతున్న నాశనాన్ని గురించి ఆయన హెచ్చరిక చేశాడు. (యిర్మీయా 1:11-19) దాని ఫలితంగా, వినాశనం పలికే వానిగా తనను పరిగణిస్తున్న తన స్వదేశస్థులను యిర్మీయా అనేకసార్లు ఎదుర్కోవలసి వచ్చింది.

దేవుని మందిరంలో పెద్ద నాయకుడైన పషూరను యాజకుడు, యిర్మీయా ప్రవచిస్తున్న విషయాలనుబట్టి ఆయనను ఒకసారి కొట్టి, బొండలో వేయించాడు. ఇదొక ఆటంకంలా కనిపించడంతో, యిర్మీయా ఇలా అన్నాడు: “నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను.” ఆ ప్రవక్త ఈ మాటలు పలికేంతగా నిరుత్సాహం చెందాడు: “ఆయన [యెహోవా] పేరు నేనెత్తను, ఆయన నామమునుబట్టి ప్రకటింపను.”—యిర్మీయా 20:1, 2, 7-9.

అయితే, యిర్మీయా నిరుత్సాహానికి లొంగిపోలేదు. “యెహోవా మాట”ను గురించి మాట్లాడుతూ ఆయనిలా ప్రకటించాడు: “అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికియున్నాను, చెప్పక మానలేదు.” (యిర్మీయా 20:8, 9) దేవుని ప్రవచనాలను గురించి మాట్లాడటానికి బలంగా ప్రేరేపింపబడిన వాడై, యిర్మీయా పరిశుద్ధాత్మ చేత బలపర్చబడి, తనకు ఆజ్ఞాపింపబడిన పనిని పూర్తి చేశాడు.

అపొస్తలుడైన పౌలు కూడా నిరుత్సాహం చెందేందుకు అనుమతించి ఉంటే వాటికి లొంగిపోడానికి అనేక కారణాలను కలిగి ఉండినాడు. ఆయన ప్రకృతి వైపరీత్యాలను, ఓడ పగిలినప్పుడు వచ్చిన శ్రమలను, హింసను, దెబ్బలను సహించాడు. దానికి తోడు, ‘సంఘములన్నిటినిగూర్చిన చింత ఉండి, ఆ భారము ఆయనకు దినదినమునకు కలుగుచుండెను.’ (2 కొరింథీయులు 11:23-28) అవును, అవి స్థాపించబడటానికి పౌలు సహాయం చేసిన క్రొత్త సంఘాలను గురించి చింతిస్తూ, ఆయన ప్రతిదినం సమస్యలతో వ్యవహరించాల్సి వచ్చేది. అంతేకాకుండా, ఆయన అపరిపూర్ణుడై ఉండి ఆయన “శరీరములో” ఉన్న “ఒక ముల్లు”తో వ్యవహరించాల్సి ఉండేది, అది బహుశా కంటిచూపు మందగించడం అయ్యిండవచ్చు. (2 కొరింథీయులు 12:7; రోమీయులు 7:15; గలతీయులు 4:15) కొందరు పౌలు వెనుక ఆయనకు విరుద్ధంగా మాట్లాడారు, మరి ఇది ఆయన చెవినపడింది.—2 కొరింథీయులు 10:10.

ఏమైనప్పటికీ, తనను నిరుత్సాహం ఆవహించడానికి పౌలు అనుమతించలేదు. ఆయన మానవాతీతమైన వ్యక్తికాదు, కానేకాదు. (2 కొరింథీయులు 11:29, 30) ఆయన ‘లోని మంట’ ఎలా రగులుతూ ఉండినది? ఒక విషయమేమంటే, ఆయనకు మద్దతునిచ్చే సహవాసులు ఉండిరి, వారిలో కొందరు ఆయన గృహనిర్బంధంలో ఉంచబడిన రోమాకు కూడా ఆయనతోపాటు వచ్చారు. (అపొస్తలుల కార్యములు 28:14-16) రెండవది, అపొస్తలుడు తన పరిస్థితిని సమతూకమైన దృష్టితో చూశాడు. ఆయన హింసకులు, విరోధులది తప్పుకానీ, పౌలుది మాత్రం కాదు. తన భూజీవితం ముగింపుకు వస్తున్నప్పుడు, ఆయన తన పరిచర్యను అనుకూల పద్ధతిలో ఉన్నతపర్చి ఇలా చెప్పాడు: “ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకు . . . అనుగ్రహించును.”—2 తిమోతి 4:8.

అన్నిటికంటే ఎక్కువగా పౌలు క్రమంగా యెహోవా దేవున్ని ప్రార్థనలో సమీపించాడు, మరి ‘ప్రభువు ఆయన ప్రక్క నిలిచి ఆయనను బలపరచెను.’ (2 తిమోతి 4:17) పౌలు ఇలా చెప్పాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీయులు 4:13) దేవునితో మరియు తోటి క్రైస్తవులతో సంభాషణ, దానితోపాటు తన పరిచర్యపట్ల అనుకూలమైన దృక్పథం, పౌలు యెహోవా సేవలో కొనసాగడానికి సహాయం చేశాయి.

పౌలు ఇలా వ్రాయడానికి దేవుడు ఆయనను ప్రేరేపించాడు: “మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.” (గలతీయులు 6:7-9) ఏ పంటకోస్తాం? నిత్య జీవితం. కావున, యిర్మీయా, పౌలు మరియు లేఖనాల్లో ప్రస్తావింపబడిన అనేకమంది ఇతర నమ్మకస్థులైన యెహోవాసాక్షులవలె ఉండండి. అవును, వారివలె ఉండి నిరుత్సాహానికి లొంగిపోకండి. మీ దీపం ఆరిపోనివ్వకండి.—మత్తయి 5:14-16 పోల్చండి.

[25వ పేజీలోని చిత్రాలు]

పౌలు మరియు యిర్మీయాలు తమ దీపాన్ని ఆరిపోనివ్వలేదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి