ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు—న్యూజీలాండ్
ద్వీపములు యెహోవాను స్తుతించగలవా? యెషయా 42:10 ప్రకారం స్తుతించగలవు: “ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి.” న్యూజీలాండ్గా ఆవిర్భవించిన ద్వీపాలు తప్పక యెహోవాను స్తుతిస్తున్నాయి. సరస్సులు, సెలయేళ్లు, సమున్నత పర్వతాలు, హిమఖండాలు, సముద్రతీరాలు, ఫెర్న్ చెట్లతో అలంకరింపబడి ఉన్న వర్షారణ్యాలు మరియు అందమైన పచ్చిక బయళ్లు, వీటన్నిటినిబట్టి ప్రపంచంలో పేరుగాంచిన న్యూజీలాండ్, భూమ్యాకాశాలకు సృష్టికర్త అయిన వాని మహిమను, వైభవాన్ని గురించి సుస్పష్టంగా మాట్లాడుతుంది.
ఈ శతాబ్దాంతం నుండి, పవిత్రారాధనలో ఆయన వైపు తిరగడం ద్వారా ఇతరులతో దేవుని రాజ్యసువార్తను పంచుకోవడం ద్వారా న్యూజీలాండ్ నివాసులలో అనేకమంది యెహోవాను స్తుతించడంలో తమ స్వరాలను కలిపారు. బంధువులకు సాక్ష్యమివ్వడాన్ని గురించిన ఒక చక్కని అనుభవాన్ని విన్న ఒక సహోదరుడు, తన కుటుంబానికి సాక్ష్యమిచ్చేందుకు ప్రయత్నించాలని ఇటీవలనే తీర్మానించుకున్నాడు. ఆయన మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకం యొక్క ప్రతులను కుటుంబ సభ్యులలో అనేకులకు బహుకరించాడు. ఇప్పటివరకూ వచ్చిన ఫలితాలేమిటి? ఒక సహోదరి, ఒక సహోదరుడు ఇప్పుడు బైబిలు పఠిస్తున్నారు, ఒక మేనల్లుడు యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాడు, మరి ఇతరులు ఇప్పుడు దేవుని వాక్యం యొక్క సత్యంపట్ల ఎక్కువ సుముఖతను కలిగి ఉన్నారని ఆయన నివేదిస్తున్నాడు. ఆయన పనిచేసేందుకు ఇంకా ఎంతో పెద్ద ప్రాంతం ఉంది; తన తలిదండ్రులే కాకుండా, ఆయనకు ఆరుగురు సహోదరులు, తొమ్మిదిమంది సహోదరీలు ఉన్నారు!
సాక్షులు రాజ్యమందిరాలను నిర్మించడానికి చేతులు కలిపినప్పుడు కూడా యెహోవాకు స్తుతి చెల్లింపబడుతుంది. ఉదాహరణకు, వార్తాపత్రిక కాలమిస్టు అయిన రాయ్ పెర్కిన్స్ 1994 మే 17, నాటి ఒపోటికీ న్యూస్‌లో ఇలా వ్రాశాడు: “ఒక అవిశ్వాసినైన నేను, తమ దేవుని ప్రేమ కొరకైన ఆ యోజనలో అంత సమయాన్ని, ప్రయాసను వెచ్చించిన ఆ సమర్పిత పనివారి పనిని, ప్రయాసను బట్టి ఎంతో ముగ్ధున్ని అయ్యాను.
“వారాంతంలో అన్ని గంటలు కష్టపడి పనిచేసినప్పుడు, ఒక యూనియన్ గొడవను గురించైనా నేను వినలేదు, చూడలేదు . . . స్త్రీలు తమ పురుషులతోపాటు సరంబీపై ఉండి సున్నం గీకేయడం మరలా వేయడం, ఎత్తడం, మోసుకెళ్లడం వంటిపనులు చేస్తూ, సంతోషమైన మూడ్‌లో ఉన్నారు.
“మరి వారిలో ఎవరూ సిగరెట్ కాల్చడానికి పట్టేంత సమయాన్ని కూడా అసలు వృధా చేయలేదు. ఏ స్థానంలో పని చేస్తున్న వారెవరికైనా, అక్కడ పెయింట్ల వాసన మరియు ఇటుకల దుమ్మూ తప్ప మరే ఇతర కాలుష్యం లేదు.”
ఒపోటికీ సంఘం యొక్క పెద్దల సభ ఇలా వ్రాసింది: “ఆ యోజన యావత్ పట్టణాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అందరూ దాని గురించే మాట్లాడుతున్నారా అన్నట్లుగా ఉంది. అనేక బైబిలు పఠనాలు ప్రారంభించబడ్డాయి. మాకు చాలా ఉత్సాహం కలిగించిన ఒక ప్రాముఖ్యమైన విషయం, తమను దర్శించవద్దని అనేక సంవత్సరాలుగా సాక్షులను కోరిన ప్రగాఢమైన మతపర విశ్వాసాలుగల ఒక దంపతుల విషయమే. వారు ప్రతిదినం నిర్మాణస్థలం దగ్గరకు వచ్చారు, తర్వాత కూటానికి కూడా వచ్చారు. భర్త తర్వాత ఇలా చెప్పాడు, ‘మీరు దేవుని ప్రజలని నేను గ్రహించాను. ఇలాంటి ప్రజలతో సహవసించాలనే నా జీవితాంతం లోలోపల నేను ఆశించాను.’”
డునేడిన్లోని త్వరగా నిర్మించిన రాజ్యమందిరం గురించి, ఒటాగో డెయిలీ టైమ్స్‌కు చెందిన కాలమిస్ట్ గత సంవత్సరం ఇలా చెప్పాడు: “అది ఎంతో విశేషమైన కార్యం, ప్రేరణ మరియు స్వయం సహాయం యొక్క మహత్తరమైన ఉదాహరణ.” అదే వార్తాపత్రిక ఇలా వ్యాఖ్యానించింది: “ఒక పెద్ద భవనం వారి ఎదుట నిర్మింపబడుతుండగా పట్టణస్థులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు, స్వచ్ఛంద సేవకుల పెద్ద గుంపు ఇలాంటిది మరొకటి మరియు ఇంతటి సేవా భావం ఉంటే, ఇలాంటి ఇతర మార్పులు మరియు అనుకూల యోజనలను ఇంకా ఎన్నింటిని సాధించవచ్చోనని అనేకులు ఆలోచిస్తున్నారు. నిర్మాణాత్మకమైన కృషి సాధించిన ఫలితాల్లో రాజ్యమందిరం ఒక సగర్వ చిహ్నం.”
నిర్మాణ స్థలాన్ని దర్శించిన అనేక వందల మందిలో, సభ్యులు తగ్గుతున్నందుకు తన మతశాఖలు వాటిని అమ్ముతుంటే, సాక్షులు “చర్చీలు” నిర్మిస్తున్నారని ఒక వ్యక్తి గమనించాడు. “ఒకవేళ మీరు మరో పన్నెండు నెలలు వేచి ఉంటే, మీరు మా వాటిలో ఒకదాన్ని కొనగల్గేవారే,” అని అనడానికి అతడు సాహసించాడు. “మేము చెల్లింపులు చేయలేం గనుక ఒకటి అమ్మాల్సి ఉంది. అయితే, మీకు డబ్బు తీసుకుని పని చేసే మతగురువులు లేరు. . . . మీ కట్టడాలకు ఎక్కువ నియంత్రణ కూడా అవసరంలేదు, ఎందుకంటే నియంత్రణ చేయడం అసాధ్యమయ్యే చర్చి గోపురాలు మీకు ఉండవు.”
వాస్తవంగా ద్వీపాలు దేవున్ని స్తుతిస్తున్నాయన్నది స్పష్టం. ఈ అందమైన పసిఫిక్ ప్రాంతంలో—మరి ప్రపంచవ్యాప్తంగా యెహోవా స్తుతి ప్రతిధ్వనించునుగాక!
[9వ పేజీలోని బాక్సు]
దేశ గణాంక వివరాలు:
1994 సేవా సంవత్సరం
సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 12,867
నిష్పత్తి: 1 సాక్షికి 271
జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారి సంఖ్య: 24,436
సగటు పయినీర్ ప్రచారకులు: 1,386
సగటు బైబిలు పఠనాలు: 7,519
బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 568
సంఘాల సంఖ్య: 158
బ్రాంచి కార్యాలయం: మానురేవా
[9వ పేజీలోని చిత్రం]
1930లో పయినీర్లు ప్రాంతీయ సేవకు వెళ్తున్నారు
[9వ పేజీలోని చిత్రం]
మానురేవాలోని బ్రాంచి వసతులు
[9వ పేజీలోని చిత్రం]
ఆక్లాండ్ నందలి డీవాన్పోర్ట్లో రాజ్యసువార్తను ప్రకటించడం