దేవుని నామము గల నాణెములు
ఇక్కడ చూపించబడిన వెండి నాణెములను దగ్గిరగా పరిశీలించండి. జర్మన్ చక్రవర్తైన విల్‌హెల్మ్ V, 1627 నుండి 1637 వరకు చేసిన ఏలుబడి కాలంలో ముద్రింపజేశాడు. ఆ సమయంలో, కాథోలిక్కులు మరియు ప్రొటెస్టెంట్ల మధ్య జరిగిన ముప్పై సంవత్సరాల యుద్ధపు ఉచ్చులో మధ్య ఐరోపా చిక్కుకుపోయింది. ప్రొటెస్టెంట్ ఉద్యమంతో విల్‌హెల్మ్ చేతులు కలిపాడు. ఈ యుద్ధానికి అవసరమైన ధనసహాయాన్ని చేసేందుకు, తన వెండినంతటినీ తీసుకుని దాన్నుండి వెండి నాణెములను ముద్రించాడు.
ఆసక్తికరంగా, ఈ నాణెములపై గుండ్రని ఆకారంలో దేవుని పేరైన యెహోవా హెబ్రీ చతురక్షర రూపం చుట్టూ సూర్యుడున్నట్లుగా చిత్రించబడి ఉండడం కనిపిస్తుంది. శక్తిని సూచించే ఓ ఈత చెట్టుకూడా ఉంది. దాని అన్వయింపు ఏమిటంటే, గాలివలన అది వంగిపోయినప్పటికీ దేవుని రక్షణలో అది విరిగిపోకుండా నిలుచుంటుంది. ఆ నాణెము చుట్టూ లాటిన్ భాషలోని వ్రాత ఇలా ఉంది: “యెహోవా చిత్తమున్నంతమట్టుకు నేను క్షేమంగా కాపాడబడతాను.”
దేవుని రక్షణ కొరకు ప్రార్థించే బదులు, అలా దేవుని నామాన్ని ఉపయోగించడం నిజంగా వ్యర్థమే, ఎందుకంటే మానవుల దౌర్జన్యపూరితమైన వివాదాలలో యెహోవా పక్షం వహించడు. వాస్తవానికి, ముప్పై సంవత్సరాల యుద్ధం దేవుని అంగీకారాన్ని పొందివుండదు. “ఓ హెచ్చరికా అంచనా ప్రకారం, ఈ యుద్ధ సమయంలో సగానికి తక్కువ కాకుండ జర్మన్ ప్రజలు మరణించారని” ఫంక్ & వాగ్నల్స్ న్యూ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. “ఎన్నిక లేని జర్మన్ పట్టణాలు, నగరాలు, గ్రామాలు మరియు పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. జర్మనీనందు పారిశ్రామిక, వ్యావసాయిక, వాణిజ్య సౌకర్యాల్లో రమారమి మూడింట రెండొంతులు నాశనమయ్యాయి.”
ఇలా యెహోవా నామాన్ని ఉపయోగించడం, ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆజ్ఞను గుర్తుచేస్తుంది: “దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగానుచ్చరింపకూడదు.” (నిర్గమకాండము 20:7) అయినప్పటికీ, ఈ నాణెములు దైవ నామమైన యెహోవా, జర్మన్ ప్రజలకు ఎప్పటినుండో పరిచయముందని చూపుతున్నాయి. ఆ నామమును కల్గివున్న దేవుని గూర్చి మీకు ఎంత బాగా తెలుసును?