కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 3/1 పేజీ 32
  • “వృక్షాయుష్యమంత”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “వృక్షాయుష్యమంత”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 3/1 పేజీ 32

“వృక్షాయుష్యమంత”

మూడు వేల సంవత్సరాల కంటే పూర్వం, మోషే ఈ విధంగా వ్రాశాడు: “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే.”—కీర్తన 90:10.

వైద్య రంగం పురోభివృద్ధి చెందినప్పటికీ, మానవుని సగటు ఆయుష్కాలం మోషేకాలములో ఎంత ఉందో ఇప్పటికీ అంతే ఉంది. అయినప్పటికీ, మానవులు అటువంటి క్షణభంగురమైన ఉనికిని కలిగివుండాలని ఎల్లప్పుడూ శపించబడరు. బైబిలులోని యెషయా గ్రంథంలో, దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతయగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.”—యెషయా 65:22.

బైబిలు దేశాల్లో దీర్ఘాయుష్షు గల వృక్షాల్లో ఒలీవ వృక్షం ఒకటి. ఇప్పటికీ గలిలయలో పెరుగుతున్న వెయ్యేండ్ల ఆయువు గల అనేక ఒలీవ వృక్షాల్లో పైన చిత్రించబడిన వృక్షము ఒకటి. మానవులు అంత దీర్ఘకాలం ఎప్పుడు జీవిస్తారు? దేవుడు “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” సృజించినప్పుడు అలా జరుగుతుందని అదే ప్రవచనం వివరిస్తుంది.—యెషయా 65:17.

దేవుడు ‘వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేసి, మరణము ఇక ఉండని దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండని’ “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని”—ఒక క్రొత్త పరలోక ప్రభుత్వాన్ని, ఒక క్రొత్త మానవ సమాజాన్ని స్థాపించడాన్ని గూర్చి ప్రకటన గ్రంథం కూడా ప్రవచిస్తోంది.—ప్రకటన 21:1, 4.

ఈ దైవిక వాగ్దానము త్వరలోనే నెరవేర్చబడుతుంది. అప్పుడు, ఒలీవ వృక్షాయుష్షు కూడా కేవలం 24 గంటలు గల ఒక రోజులా అనిపిస్తుంది. మరియు మన చేతి పనులను పూర్తిగా అనుభవించేందుకు మనకు తగినంత సమయం లభిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి