కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 6/15 పేజీలు 3-4
  • మరణించిన మీ ప్రియమైనవారు వారెక్కడున్నారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మరణించిన మీ ప్రియమైనవారు వారెక్కడున్నారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • పునరుత్థాన నిరీక్షణ ఒక వాస్తవం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • మరణం తరువాత జీవితం—ఎలా, ఎక్కడ, ఎప్పుడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మరణానంతర జీవితం—బైబిలేమి చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 6/15 పేజీలు 3-4

మరణించిన మీ ప్రియమైనవారు వారెక్కడున్నారు?

అలెక్‌ ఎంతో కలతచెందాడు. ఒక్క వారంలోనే, అతను తన యిద్దరు స్నేహితులను పోగొట్టుకున్నాడు. వారిలో ఒకరైన నెవెల్‌ కాల్పుల గాయంవల్ల చనిపోయారు. టోని అనే మరొకరు వాహన ప్రమాదంలో చనిపోయారు. మునుపు తనను వేధించని ప్రశ్నలు 14 ఏండ్ల తూర్పు ఆఫ్రికా పిల్లవాన్ని పట్టి పీడించాయి. ‘అసలు ప్రజలు ఎందుకు చనిపోవాలి? చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది?’ అని అతను సందేహించాడు.

నెవెల్‌ అంత్యక్రియలకు వెళ్తున్న దారిలో తన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని అలెక్‌ యథార్థంగా నిరీక్షించాడు. “కానీ, మతగురువు కేవలం ఓ పుస్తకం నుండి చదివి, నెవెల్‌ పరలోకానికి వెళ్లాడని చెప్పాడు. తర్వాత, సమాధి దగ్గర, మనం అతని పునరుత్థానం కొరకు ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పాడు. నాకు అయోమయంగా అనిపించింది. నెవెల్‌ పరలోకానికి వెళ్తే, అతను పునరుత్థానం కొరకు ఎందుకు నిరీక్షిస్తూ ఉంటాడు?” అని అతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు.

తర్వాత అదే రోజున, అలెక్‌ టోని అంత్యక్రియలకు హాజరయ్యాడు. అతనికి అర్థంకాని భాషలో ఆచారకర్మలు జరిగాయి. అయినా, దుఃఖపడేవారి విచ్చలవిడి ప్రవర్తన చూస్తే, వారికి ఎలాంటి ఓదార్పును యివ్వలేదని అలెక్‌కు అర్థమైంది. “ఆ రాత్రి, నేను చాలా కలతచెందాను. నేను నిస్సహాయుడనై అయోమయంలో పడ్డాను. నా ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలను ఎవ్వరూ యివ్వలేకపోయారు. నా జీవితంలో మొట్టమొదటి సారిగా, దేవుడు అనే వాడు ఉన్నాడా అని నేను ఆలోచించాను” అని అతను వివరిస్తున్నాడు.

ప్రతి సంవత్సరం అలెక్‌ వంటి లక్షలాదిమంది, మరణం వల్ల తమ ప్రియమైనవారిని పోగొట్టుకుంటున్నారు. “ప్రపంచవ్యాప్తంగా, 1991లో 5,04,18,000 మంది మరణించడం జరిగింది,” అని 1992 బ్రిటానికా బుక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ వివరిస్తుంది. మరి ఆ నాటినుండి ఎన్ని లక్షలమంది ప్రజలు మరణించారు? ప్రియమైన వారిని కోల్పోయినవారి కన్నీటి ఏరులను ఒక్కసారి ఊహించండి! వారి వ్యధకు, మరణాన్ని గూర్చిన పరస్పర విరుద్ధమైన దృక్పథాలు రేపే గందరగోళం తోడైంది.

అలా అలెక్‌ వంటి అనేకులు, మరణం తర్వాత భవిష్యత్‌ జీవితం ఉందన్న నిరీక్షణకు ఆధారం ఉందో లేదోనని అనుమానిస్తారు. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలిజియన్స్‌ ప్రకారం, “అన్ని యుగాల్లోనూ, మెదడూ శరీరాల నుండి ఆత్మ లేక జీవం వేరుపడి ఎలా ఉనికిలో ఉండగలదన్న విషయాలపై అనుమానాలను వ్యక్తపరుస్తూ . . . ఆలోచనాపరులైన మనుష్యులు యితరులకు భిన్నంగా ఉన్నారు.”

శరీరంనుండి విడిగా అమర్త్యమైన ఆత్మ జీవిస్తుందనే మత సిద్ధాంతానికి బైబిలు మద్దతివ్వడంలేదని పై ఎన్‌సైక్లోపీడియా ఒప్పుకుంటోందన్నది. నిజమే, కొన్ని సందర్భాల్లో, ఓ వ్యక్తి “ఆత్మ” అతని శవాన్ని విడిచినట్లు, తిరిగి వచ్చినట్లు బైబిలు సూచిస్తోంది, అయితే ఈ సందర్భాల్లో కోల్పోయిన లేక మరలా పొందిన “జీవం” అనే భావంలో “ఆత్మ” ఉపయోగించబడింది. (ఆదికాండము 35:16-19; 1 రాజులు 17:17-23) తరచుగా, “ఆత్మ” అనే పదాన్ని, రక్తమాంసాలతో కూడిన దృశ్యమైన జీవులను, అవును, జీవించే ప్రాణులను వర్ణించడానికి బైబిలు ఉపయోగించింది. (ఆదికాండము 1:20; 2:7) కాబట్టి, ఆత్మలు చనిపోతాయని బైబిలు పదేపదే పేర్కొంటోంది. (యెహెజ్కేలు 18:4, 20; అపొస్తలుల కార్యములు 3:23; ప్రకటన 16:3) ఆత్మలు ఒక్కసారి చనిపోయిన తర్వాత, అవి ‘ఏమియు ఎరుగవు’ అని దేవుని వాక్యం చెబుతోంది.—ప్రసంగి 9:5, 10.

మరోవైపు, మరణించినవారు జీవ పునరుత్థానాన్ని పొందిన వృత్తాంతాలు బైబిల్లో ఉన్నాయి. లాజరు విషయంలో, అతను చనిపోయిన నాలుగు రోజులకు యిది సంభవించింది. (యోహాను 11:39, 43, 44) మరి, వందలు లేక వేల సంవత్సరాల క్రితం చనిపోయినవారికి ఏమి జరుగుతుంది? తమ భవిష్యత్‌ జీవిత నిరీక్షణ కొరకు, తాము చనిపోయినప్పుడున్న అదే శరీరంతో దేవుడు వారిని పునరుత్థానం చేయవలసిన అవసరముందా?

లేదు. అలాంటి ఆలోచన, శవంలోని అణువులకు సంభవించే వాటికి ఏ సంబంధం లేకుండా ఉంటుంది. సమయం గడిచేకొలది, ఈ అణువులను మొక్కలు తీసుకుంటాయి, మరలా వాటిని యితర ప్రాణులు తింటాయి, అప్పుడు అవి వాటి శరీరంలో భాగమైపోతాయి.

అంటే చాలా కాలం క్రితం చనిపోయిన వ్యక్తులకు యిక ఏ నిరీక్షణ కూడా లేదనా దాని భావం? కాదు. మన విశాల విశ్వ సృష్టికర్తకు అద్భుతమైన, అగమ్యమైన జ్ఞాపకశక్తి ఉంది. ఆయనకున్న పరిపూర్ణ జ్ఞాపకశక్తితో, తాను జ్ఞాపకముంచుకోడానికి ఎన్నుకున్న ఏ వ్యక్తి వ్యక్తిత్వాన్నైనా, అతని జన్యు లక్షణాలనైనా దాచివుంచగల శక్తి ఆయనకుంది. అంతేకాకుండా, గతంలో జీవించిన వ్యక్తి కల్గివుండిన అదే జన్యు రచనతో అతని శరీరాన్ని మరలా సృజించగలశక్తి యెహోవా దేవునికుంది. అంతేకాక ఆయనకు జ్ఞాపకమున్న అబ్రాహాము వంటి వ్యక్తిలో ఆ జ్ఞాపకశక్తిని, వ్యక్తిత్వాన్ని ఉంచగలడు.

అబ్రాహాము మరణించిన సుమారు రెండు వేల సంవత్సరాల తర్వాత, యేసు ఈ అభయాన్ని యిచ్చాడు: “పొదనుగూర్చిన భాగములో—ప్రభువు ‘అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు’ చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారు.” (లూకా 20:37, 38) అబ్రాహాము ఇస్సాకు యాకోబులు మాత్రమే కాకుండా, రానున్న పునరుత్థానం కొరకు వేచివున్న అనేకులు దేవుని జ్ఞాపకశక్తిలో సజీవులుగా ఉన్నారు. “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని” బైబిలు నిర్థారిస్తోంది.—అపొస్తలుల కార్యములు 24:15.

తన ప్రియమైనవారిని కోల్పోయిన కొన్ని వారాల తర్వాత, అలెక్‌ తన ప్రశ్నలకు జవాబులను కనుగొన్నాడు. యెహోవాసాక్షుల్లో ఒకరు తన యింటికి వచ్చి మరణం గూర్చి, పునరుత్థానం గూర్చి దేవుని వాక్యం ఏమి చెబుతుందన్న విషయాలను చూపించారు. ఇది అలెక్‌ను ఓదార్చి, తన జీవితానికే ఓ కొత్త అర్థాన్నిచ్చింది.

మీరు కూడా బైబిలు ఆధారిత పునరుత్థాన నిరీక్షణను గూర్చి మరిన్ని వివరాలను తెలుసుకోడానికి యిష్టపడుతున్నారా? ఉదాహరణకు, ఎక్కువ పునరుత్థానాలు పరలోకంలో జరుగుతాయా లేక భూమ్మీద జరుగుతాయా? అంతేకాక దేవుని అంగీకారాన్ని పొందడానికీ, ప్రజలు మరణించిన తమ ప్రియమైన వారిని తిరిగి కలుస్తారనే ఆయన అద్భుతమైన వాగ్దాన నెరవేర్పును అనుభవించడానికి ఓ వ్యక్తి ఏమి చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి