కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 4/15 పేజీ 32
  • ముత్యాల కంటే విలువ గలవి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ముత్యాల కంటే విలువ గలవి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 4/15 పేజీ 32

ముత్యాల కంటే విలువ గలవి

ఎర్ర సముద్రపు నీటి అడుగు భాగాన లభించిన యిటువంటి వాటిని చూసి అనేకమంది సందర్శకులు పులకించిపోయారు.

అందులో ఈదులాడే వర్షధనుస్సు రంగులు, వన్నెలు గల చేపలనేకం స్వచ్ఛమైన నీటిలో ఈదుతుండేవారిని మంత్ర ముగ్ధులను చేస్తుంటాయి. అయితే యిక్కడ కనిపించే రంగురంగుల చేపల మధ్యలో అందమైన రంగులతో అలంకరించబడిన ముత్యాలతో సహా కళ్లకు మిరుమిట్లుగొలిపే సముద్రం అడుగు భాగాన ఉండే అద్భుతాలనేకం ఉన్నాయి.

అందమైన ముత్యాలు ఎన్నో రకాల ఆకారాల్లో, రంగుల్లో ఉంటాయి. ప్రాచీన కాలంలో కూడా అద్భుతమైన ముత్యాల ముక్కలకు చాలా ధర పలికేదని మీరూ ఊహించగలరు. (సామెతలు 3:14, 15; యెహెజ్కేలు 27:16) అయితే ఆ రచయితలు ముత్యాల అందమూ విలువ కంటే ఎక్కువను మనం చూసేలా సహాయపడతారు.

ఇంకా విలువగల కొన్ని విషయాలున్నాయి, మరి మనం వాటిని గొప్పగా దాచి ఉంచుకోవాలని రచయితలు నొక్కితెల్పారు. ఓ మంచి, సామర్థ్యం గల భార్య యిలా ఉంటుందని మనం చదువుతాం: “గుణవతియైన భార్య దొరకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.” (సామెతలు 31:10) మీరు వివాహమైన పురుషులా? ఇక్కడున్న ఈ ప్రశస్తమైన ముత్యాలను మరొకసారి చూసి, మీరు మీ భార్యకు యివ్వాల్సినంత విలువను వారికిస్తున్నారోలేదో చూసుకోండి.

మనం స్త్రీలమైనా లేక పురుషులమైనా, వివాహితులమైనా లేక అవివాహితులమైనా, ప్రకాశవంతమైన ముత్యాలను చూడ్డం దైవిక జ్ఞానం, వివేకం, తెలివిని మనం మరింత గొప్పగా మెచ్చుకోడానికి సహాయపడుతుంది. దేవుని వాక్యం యిలా అంటుంది: “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీయిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.”—సామెతలు 3:13-15; 8:11.

కాబట్టి వాటిని మనం ఈతకొడుతూ చూసినా లేక ఫోటోలో చూసినా, ఎర్ర సముద్రంలోని పగడాలు మనకు అందాన్నీ అలాగే ప్రతిఫలమిచ్చే ప్రయోజనకరమైన వస్తువులను అందించాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి