దాచబడిన ధనాన్ని వెదకుట
అమెరికాలోని కాలిఫోర్నియాలోనున్న ఓ గ్రామంలోని సాటర్స్ రంపపు మిల్లున్న ప్రాంతంలో, 1848లో బంగారం కనుగొనబడింది. త్వరలోనే ధనవంతులు కావాలనే నిరీక్షణతో 1849వ సంవత్సరం నాటికే వేలాది మంది గుంపులు గుంపులుగా ఆ ప్రాంతానికి తరలి వచ్చారు. అమెరికా చరిత్రలోనే అత్యంత గొప్ప పసిడి పంటకొరకు ప్రయత్నాలు కొనసాగుతుండెను. ఒక సంవత్సరంలోపే, సమీపంలోని శాన్ ఫ్రాన్సిస్‌కో, ఓ మోస్తరు పట్టణమునుండి 25,000 జనాబాగల నగరంగా పెరిగింది. ఆకస్మికంగా వచ్చిన ఆస్తి ఓ శక్తివంతమైన ఆకర్షణయ్యింది.
పూర్వమున ఇశ్రాయేలు రాజైన సొలొమోనుకు దాచబడిన ధనంకొరకు మనుష్యులెలా కష్టించి త్రవ్వుతారో తెలుసు, అందుకే ఆయన యీ విషయాన్ని ఇలా వ్రాశాడు: “తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసిన యెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును.”—సామెతలు 2:3-5.
వెండి బంగారాలతో మీరనేక వస్తువులను చేయవచ్చు, గాని జ్ఞానవివేచనలతో అంతకంటే ఎక్కువ చేయవచ్చును. వీటి మూలంగా మీరు సరియైన నిర్ణయాలు చేస్తారు, సమస్యలు పరిష్కరిస్తారు, వివాహ జీవితంలో విజయం సాధిస్తారు, ఆనందాన్ననుభవిస్తారు. (సామెతలు 2:11, 12) అలాగే నిజమైన జ్ఞానం, తెలివి నీవు సృష్టికర్తను ఎరుగుటకును, ఆయన సంకల్పాలు తెలిసికొనుటకును, ఆయనకు విధేయుడవై ఆయనను ప్రీతి పరచుటకును నీకు సహాయం చేస్తాయి. బంగారం వీటిలో దేనిని నీకివ్వలేదు.
బైబిలు మాటలు సత్యములే: “ద్రవ్యము వలెనే జ్ఞానం కూడా ఆశ్రయాస్పదమే; అయితే జ్ఞానంవల్ల వచ్చు ప్రయోజనమిదే: జ్ఞానం దాన్ని పొందినవారి ప్రాణాన్ని రక్షిస్తుంది.” (ప్రసంగి 7:12, న్యూ ఇంటర్నేష్నల్ వర్షన్) క్షణంలో ధనవంతులు కావాలని అనేకులు కలలు కంటూ వుండగా, బైబిలును తెరచి, నిజమైన ధనమగు జ్ఞాన, వివేచన, బుద్ధి, తెలివి కొరకు త్రవ్వితే ఎంతో జ్ఞానయుక్తంగా వుంటుంది.