కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 6/1 పేజీ 32
  • మీరెందుకు హాజరుకావాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరెందుకు హాజరుకావాలి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • అపాయకరమైన మన కాలముల కొరకున్న దైవిక బోధను పొందండి
    తేజరిల్లు!—1993
  • “దైవ భయము” జిల్లా సమావేశం దగ్గరపడుతోంది
    తేజరిల్లు!—1994
  • “ఆనందమయ స్తుతికర్తలు” యెహోవాసాక్షుల జిల్లాసమావేశము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • “దేవుని వాక్యంలో విశ్వాసం” జిల్లా సమావేశానికి రండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 6/1 పేజీ 32

మీరెందుకు హాజరుకావాలి

ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇప్పటికే ఆరంభమైన “దైవిక బోధ” జిల్లాసమావేశాల్లో మీరెంతో ప్రయోజనాత్మక ఆత్మీయ ఉపదేశాన్ని పొందుతారు. భారతదేశంలో ఈ సంవత్సరం కొరకు 17 సమావేశాలు ఏర్పాటుచేయబడగా, అవి సెప్టెంబరు ఆఖరివారం మొదలుకొని 1994 జనవరి మొదటి వారంవరకు జరుగుతాయి. సాధారణంగా కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 1:20కు ఆరంభమై ఆదివారం సాయంకాలం 4:15కు ముగుస్తుంది. ఈ సమావేశాల్లో ఒక ఉన్నతాంశమేమంటే, ప్రపంచమందలి ఇతర ప్రాంతాల్లో ఈ సంతోషకర సమావేశాలకు హాజరయ్యేందుకు తమ స్వదేశాలకు తిరిగిరావడానికి సహాయం చేయబడిన మిషనరీల నివేదికలుంటాయి.

మీరు వృద్ధులైననూ, యౌవనులైనను అనగా భర్తగా, భార్యగా, తండ్రిగా, తల్లిగా, కుర్రవానిగా లేదా పిల్లవానిగా ఉన్ననూ నీకు ప్రయోజనమిచ్చే స్పష్టమైన, ఒప్పింపజేసే బోధను మీరు పొందుతారు. ఉదాహరణకు, జీవిత సంకల్పమేమి? అని నేడు చాలామంది ప్రశ్నిస్తారు. శుక్రవారం ఉదయం, ఈ ప్రశ్న చర్చించడాన్ని విని, అదే అంశాన్ని ఇతరులు అర్థం చేసుకోవడానికి సహాయపడ్డానికి మీరు పొందే సమాచారమందు ఆనందిస్తారు.

శుక్రవారం మధ్యాహ్న కార్యక్రమంలో “వివాహాన్ని శాశ్వతకాల బంధంగా చేసుకొనుట,” “మీ కుటుంబ రక్షణకు కష్టించి పనిచేయుము,” “తలిదండ్రులారా—మీ పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం” అనే భాగాలు ఉంటాయి. వీటి తర్వాత వెంటనే, యౌవనస్థులు ఎదుర్కొనే సమస్యలు, వారు వాటితో ఎలా వ్యవహరించగలరనే విషయంపై ప్రత్యేక దృష్టి నిల్పబడుతుంది. వారు తమ సృష్టికర్తను ఇప్పుడే స్మరణకు తెచ్చుకొను యౌవనులు అనే ఆధునిక దిన నాటకం ద్వారా ప్రోత్సహింపబడతారు.

శనివారం కార్యక్రమం అంత్యదినాల్ని గూర్చి యేసుచెప్పిన ప్రవచనం, ప్రత్యేకంగా “ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యునికమ్మును” అని ఆయన పలికిన మాటలకు సంబంధించిన అంశాలుంటాయి. (మత్తయి 24:29) ఆ “శ్రమ” ఎప్పుడు సంభవించుననే చర్చ వినడానికి మీరు కోరవచ్చును. శనివారపు కార్యక్రమం ఆధునిక కాలాల్లో యెహోవాసాక్షుల నివేదికను కూడా పునఃసమీక్షించి, వారేం నెరవేర్చారో చూపిస్తుంది.

ఆదివారం ఉదయం మోసపోవద్దు లేదా దేవుని వెక్కిరింపవద్దు అనే మరో నాటకం, నేడు జనసమ్మతమైన వీడియో, సంగీతం దరిమిలా ఒక క్రైస్తవుని యథార్థతకుండే సవాలును తెలియజేస్తుంది. మధ్యాహ్నం అందింపబడే బహిరంగ ప్రసంగం “అపాయకరమైన మనకాలముల కొరకు సహాయకరమైన బోధ” అనే అంశంపై ఉంటుంది. “దైవిక బోధను హత్తుకొనియుండుము” అనే సలహాతో ఆ కార్యక్రమం ముగించబడుతుంది.

ఆ నాలుగు దినాలు హాజరగుట ద్వారా మీరు నిశ్చయముగా ప్రయోజనం పొందుతారు. మీరు హాజరు కావాలని హృదయపూర్వకంగా ఆహ్వానింపబడుచున్నారు. మీకు దగ్గరగావుండే సమావేశ స్థలం కొరకు, స్థానిక యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో కనుక్కోండి లేదా ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి