సెక్షన్ 1
పూర్వీకుల నుండి న్యాయాధిపతుల వరకు ఉన్న కాలం
ముద్రిత ప్రతి
ఈ సెక్షన్లో, దాదాపు 2,200 సంవత్సరాల కాలాన్ని చుట్టేస్తాం. మనం ఈ సెక్షన్ను, ఆదాము ఇంకా బ్రతికుండగానే జీవించిన హనోకు కథతో మొదలుపెడతాం; ఇశ్రాయేలు మొదటి రాజును అభిషేకించిన సమూయేలు కథతో ముగిస్తాం. అసాధారణ ధైర్యం చూపించిన నోవహు, అబ్రాహాము, శారా, మోషే, రాహాబు, దెబోరా, గిద్యోను లాంటి చాలామంది గురించి చూస్తాం. వీళ్లలో కొంతమంది, ప్రమాదాలతో నిండిన దారుల్లో సుదూర ప్రయాణాలు చేయడానికి ఇష్టంగా ముందుకొచ్చారు. ఇంకొంతమంది “యెహోవా యుద్ధాల్లో” పోరాడారు. వాళ్లు ఎంతో ప్రేమించిన దేవుని నుండి వచ్చిన నిర్దేశాల్ని వాళ్లందరూ ధైర్యంగా పాటించారు.