కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm23 పేజీలు 7-8
  • ఆహ్వానితులకు సమాచారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆహ్వానితులకు సమాచారం
  • 2023 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆహ్వానితులకు సమాచారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆహ్వానితులకు సమాచారం
    2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఆహ్వానితులకు సమాచారం
    2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆహ్వానితులకు సమాచారం
    2026 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
మరిన్ని
2023 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
CO-pgm23 పేజీలు 7-8

ఆహ్వానితులకు సమాచారం

అటెండెంట్లు అటెండెంట్లు ఉన్నది మీకు సహాయం చేయడానికే. పార్కింగ్‌, సీట్లు పెట్టుకోవడం, హాలు లోపలికి వెళ్లడం-బయటికి రావడం వంటివాటి గురించి వాళ్లు నిర్దేశాలిస్తారు. దయచేసి వాళ్లకు పూర్తిగా సహకరించండి.

బాప్తిస్మం బాప్తిస్మ అభ్యర్థులకు మెయిన్‌ హాలులో స్టేజీ ముందు భాగంలో సీట్లు కేటాయించబడతాయి. ఇందులో ఏదైనా మార్పు ఉంటే ముందే ప్రకటన చేస్తారు. శనివారం ఉదయం బాప్తిస్మ ప్రసంగం మొదలుకావడానికి ముందే అభ్యర్థులు ఆ సీట్లలో కూర్చోవాలి. ప్రతీ ఒక్కరు తమ టవల్‌ను, నీళ్లలో దిగేటప్పుడు వేసుకోవడానికి మర్యాదపూర్వకంగా ఉండే బట్టల్ని తెచ్చుకోవాలి.

విరాళాలు ఈ సమావేశంలో అందరికీ సరిపడా సీట్లు, సౌండ్‌ సిస్టమ్‌, వీడియో, మరితర సదుపాయాలు ఏర్పాటు చేశారు. మనం ఈ సమావేశాన్ని చక్కగా ఆనందించి, యెహోవాకు మరింత దగ్గరవ్వడానికి అవి సహాయం చేస్తాయి. ఆ ఏర్పాట్లన్నిటికి ఎంతో డబ్బు ఖర్చయింది. మీరు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు ఈ ఖర్చులకే కాక, ప్రపంచవ్యాప్త పనికి మద్దతివ్వడానికి కూడా ఉపయోగపడతాయి. సులభంగా గుర్తుపట్టగలిగే విరాళాల పెట్టెలు హాలులో అక్కడక్కడ ఉంచబడ్డాయి. మీరు కావాలనుకుంటే, donate.jw.org ద్వారా ఆన్‌లైన్‌లో కూడా విరాళం ఇవ్వవచ్చు. మీ విరాళాలకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. రాజ్య సంబంధ పనులకు ఉదారంగా మద్దతిస్తున్నందుకు పరిపాలక సభ మీకు కృతజ్ఞతలు చెప్తుంది.

ప్రథమ చికిత్స ఇది అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమేనని దయచేసి గుర్తుంచుకోండి.

పోగొట్టుకున్నవి-దొరికినవి ఇతరుల వస్తువులేమైనా మీకు దొరికితే, వాటిని ఈ విభాగానికి అప్పగించండి. ఒకవేళ మీరేదైనా పోగొట్టుకుంటే, ఈ విభాగానికి వెళ్లి చూసుకోండి. తల్లిదండ్రుల నుండి తప్పిపోయిన పిల్లల్ని ఈ విభాగానికి తీసుకెళ్లాలి. అయితే ఇది పిల్లల సంరక్షణా విభాగం కాదు. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకొని, జాగ్రత్తగా చూసుకోండి.

సీట్లు దయచేసి ఇతరుల గురించి ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుల కోసం, మీతోపాటు మీ వాహనంలో వచ్చేవాళ్ల కోసం, మీ ఇంట్లో ఉంటున్నవాళ్ల కోసం, లేదా మీ బైబిలు విద్యార్థుల కోసం సీట్లు ఆపుకోవచ్చు. దయచేసి మీకు అవసరంలేని సీట్లలో ఏమీ పెట్టకండి.

స్వచ్ఛంద సేవ సమావేశ ఏర్పాట్లకు సంబంధించిన పనుల్లో సహాయం చేయాలని ఇష్టపడుతుంటే, దయచేసి సమాచార-స్వచ్ఛంద సేవా విభాగానికి తెలియజేయండి.

ప్రత్యేక కూటం

క్లాస్‌రూమ్‌లో సహోదరసహోదరీలు శ్రద్ధగా వింటూ నోట్స్‌ రాసుకుంటున్నారు.

రాజ్య సువార్తికుల కోసం పాఠశాల

పరిచర్య ఎక్కువ చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లందరూ రాజ్య సువార్తికుల కోసం పాఠశాల అభ్యర్థులకు జరిగే కూటానికి హాజరుకావచ్చు. ఈ కూటం ఆదివారం మధ్యాహ్నం జరుగుతుంది. అది జరిగే చోటు, సమయం తర్వాత చెప్తారు.

యెహోవాసాక్షుల పరిపాలక సభ ఏర్పాటు చేసింది

© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి