కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 159
  • యెహోవాను మహిమపర్చండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను మహిమపర్చండి
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • రండి, రాజ్య గీతం పాడదాం!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • కొత్త పాట
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • కొత్త పాట
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • యెహోవాను స్తుతిద్దాం రండి!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 159

పాట 159

యెహోవాను మహిమపర్చండి

(కీర్తన 96:8)

  1. 1. విశ్వాన్ని ఏలే యెహోవా

    నీ సాటి లేరే చోటా!

    ప్రేమకర్థం నీ వ్యక్తిత్వం

    ఏమిస్తే తీరాలా రుణం!

    ఆకాశాలే చూపట్లేదా

    నీ శక్తి సౌందర్యాన్నే!

    నేనంత వాణ్ణా యెహోవా

    నీ చేతుల్లో పైకెత్తావే!

    (పల్లవి)

    స్తుతిస్తుంటా, నా పాటల్లో నిన్నే

    మహిమంతా నీ సొంతం!

    “పూజనీయ రాజు యెహోవాయే”

    అని కీర్తిస్తా నిన్నే

    స్తుతి నీకే చెల్లాలి!

  2. 2. ఈ ప్రాణం నీదే యెహోవా

    జీవిస్తా నీ కోసమే!

    నీ మంచి కీర్తిస్తా నిత్యం

    వర్థిల్లాలి నీ వైభవం!

    నీ ప్రాంగణాల్లోకి వచ్చే

    భాగ్యాన్నే నాకిచ్చావా!

    నువ్వే నా శక్తి, భరోసా

    నిర్దేశించు శాశ్వతంగా!

    (పల్లవి)

    స్తుతిస్తుంటా, నా పాటల్లో నిన్నే

    మహిమంతా నీ సొంతం!

    “పూజనీయ రాజు యెహోవాయే”

    అని కీర్తిస్తా నిన్నే

    స్తుతి నీకే చెల్లాలి!

  3. 3. భూమి, సముద్రం, ఆకాశం

    ఘోషిస్తాయి నీ ప్రేమే!

    నీ సృష్టంతా ధ్యానిస్తుంటే

    ఉప్పొంగాను సంతోషంతో!

    ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నా

    ఏమని కీర్తించనూ!

    చేశావు లెక్కకు మించి

    సుసాధ్యమా వర్ణించడం!

    (పల్లవి)

    స్తుతిస్తుంటా, నా పాటల్లో నిన్నే

    మహిమంతా నీ సొంతం!

    “పూజనీయ రాజు యెహోవాయే”

    అని కీర్తిస్తా నిన్నే

    స్తుతి నీకే చెల్లాలి!

(కీర్త. 96:1-10; 148:3, 7 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి