పాట 152
నీకు ఘనత ఇచ్చే మందిరం
(1 రాజులు 8:27; 1 దినవృత్తాంతాలు 29:14)
1. నీ చేతి పనేగా ఆకాశం
ఈ భూమి మొత్తం ఏ మాత్రం?
నిర్మించాం నీకే ఈ మందిరం
ఇస్తున్నాం దీన్ని నీ కోసం.
ఆరాధకులే అలంకారం
అవ్వాలి ఈ ఆలయంలో
ఐక్యంగా నిన్నే మేం సేవిస్తాం
మలచాలిక నీ శక్తే.
(బ్రిడ్జ్)
నువ్వు ఇవ్వనిది
ఏదైనా ఉందా మాతో?
అర్పిస్తాం మేము నీకు
నీ చేతిలో నుంచే.
(పల్లవి)
ఎంతో ఆశగా వేచిచూశాం
స్తుతే చెల్లిస్తాం ఈ చోటే.
నువ్విచ్చే నిర్దేశం పాటిస్తూ
స్మరిస్తాం ఇక నీ పేరే!
2. యెహోవా తండ్రే దయచూపి
ఇచ్చాడు తనే ఈ స్థలం
ఘనతే ఇస్తే చూడాలని
తన సేవకులే చేరి.
కుమారుని సారథ్యంలోనే
ఉత్సాహంగా సాగిపోదాం.
చాటుదాం రాజ్యం ఈ ప్రాంతంలో
తండ్రినే ఘనపర్చేలా.
(బ్రిడ్జ్)
మనకున్నంతలో
శ్రేష్ఠమైనది ఇస్తే,
మురిసే యెహోవానే—
శాశ్వతం సేవిద్దాం.
(పల్లవి)
ఎంతో ఆశగా వేచిచూశాం
స్తుతే చెల్లిస్తాం ఈ చోటే.
నువ్విచ్చే నిర్దేశం పాటిస్తూ
స్మరిస్తాం ఇక నీ పేరే!