పాట 85
ఒకరినొకరు ఆహ్వానించుకోండి
1. స్వాగతమంటూ ఆహ్వానిస్తున్నాం
ఈరోజిలా మీ అందరిని.
నేర్చుకుంటున్నాం తండ్రి మాటల్ని;
నిత్యజీవం సొంతం చేసేటి సత్యాల్ని.
2. చుట్టూ ఉన్నోళ్లు మనవాళ్లేగా,
దేవుడిచ్చే దీవెనలేగా.
పలకరిద్దాం చిరునవ్వుతో,
కురిపిద్దాం మనం వాళ్లపై ప్రేమను.
3. మనందరినీ తండ్రి పిల్చాడు
ఆయనంటే ఇష్టముందని.
యెహోవా, యేసు స్నేహాన్ని పొందాం
అందిద్దాం ఆ వరాన్ని ఇతరులకు.
(యోహా. 6:44; ఫిలి. 2:29; ప్రక. 22:17 కూడా చూడండి.)