పాట 70
అర్హుల్ని వెదకండి
1. సువార్త పని నేర్పించాడు యేసు,
నిర్దేశాలెన్నో ఇచ్చాడు.
తండ్రి ఇష్టం చేయాలనే కోరిక
ఎవరికి ఉందో చూడండి
ఇంటిలో ఉన్న వాళ్లు అర్హులైతే
మీ శాంతి వెళ్తుంది వాళ్లకు.
కానీ వాళ్లు వెళ్లిపొమ్మని అంటే
శాంతంగా వచ్చేయండి మీరు.
2. ఇంటివాళ్లు చేర్చుకుంటే మిమ్మల్ని
చేర్చుకున్నట్టే ఆయన్ని.
దేవునితో సంబంధం కావాలంటే
తండ్రికి నచ్చేలా ఉంటారు.
కంగారుపడొద్దు, ఏం చెప్పాలని
సాయం చేస్తాడు యెహోవాయే
దయగా మాట్లాడి, ప్రేమ చూపండి
వింటారు, మంచోళ్లు తప్పక.
(అపొ. 13:48; 16:14; కొలొ. 4:6 కూడా చూడండి.)