పాట 37
పూర్ణ ప్రాణంతో యెహోవాను సేవిద్దాం
1. ఓ యెహోవా, నిన్నే నేను
పూర్ణ ప్రాణంతో ప్రేమిస్తాను.
సేవిస్తాను ప్రతీరోజు;
చెల్లిస్తాను సంపూర్ణ భక్తి.
పాటిస్తాను నీ నియమాలు;
ఎంతో ప్రియం నీ ఆజ్ఞలు!
(పల్లవి)
ఓ యెహోవా, నిన్నే నేను
పూర్ణ బలంతో సేవిస్తాను.
2. సూర్యచంద్ర నక్షత్రాలు
చాటుతున్నాయి నీ మహిమ.
వాటిలాగే నమ్మకంగా
ప్రకటిస్తాను నీ పేరును.
సేవించేలా జీవితమంతా
సాయం చేయి దేవా నాకు.
(పల్లవి)
ఓ యెహోవా, నిన్నే నేను
పూర్ణ బలంతో సేవిస్తాను.
(ద్వితీ. 6:15; కీర్త. 40:8; 113:1-3; ప్రసం. 5:4; యోహా. 4:34 కూడా చూడండి.)