14వ సెక్షన్‌కు పరిచయం
తొలి క్రైస్తవులు దేవుని రాజ్య సువార్తను భూమి మీద దూర ప్రాంతాలకు ప్రకటించారు. యేసు వాళ్లు ఎక్కడ ప్రకటించాలో చెప్పాడు, అద్భుతంగా ప్రజల సొంత భాషల్లో నేర్పించేలా చేశాడు. యెహోవా వాళ్లకు ధైర్యాన్ని, ఘోరమైన హింసలు ఎదుర్కొనే శక్తిని ఇచ్చాడు.
యేసు అపొస్తలుడైన యోహానుకు యెహోవా మహిమను గూర్చిన దర్శనాన్ని ఇచ్చాడు. మరో దర్శనంలో, పరలోక రాజ్యం సాతానును ఓడించడం, అతని అధికారం అంతమైపోవడం యోహాను చూశాడు. యేసు 1,44,000 సహపరిపాలకులతో రాజుగా పరిపాలించడాన్ని యోహాను చూశాడు. భూమంతా పరదైసుగా మారడాన్ని, ప్రతి ఒక్కరు శాంతితో, ఐక్యంగా యెహోవాను ఆరాధించడాన్ని కూడా యోహాను చూశాడు.