10వ సెక్షన్‌కు పరిచయం
అన్నిటిపైన యెహోవాయే రాజు. అన్నీ ఆయన అధీనంలోనే ఉన్నాయి, ఎప్పుడూ ఆయన కిందే ఉంటాయి. ఉదాహరణకు యిర్మీయా చనిపోకుండా యెహోవా అతనిని గుంటలోనుండి బయటకు తెచ్చాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోను అగ్నిగుండం నుండి కాపాడాడు, దానియేలును సింహాలు తినకుండా కాపాడాడు. ఎస్తేరును కాపాడి ఆమె తన ప్రజలందర్నీ రక్షించుకునేలా చేశాడు. చెడుతనాన్ని యెహోవా ఎప్పటికీ అలానే ఉండనివ్వడు. పెద్ద విగ్రహం, పెద్ద చెట్టు గురించిన ప్రవచనాలు యెహోవా రాజ్యం త్వరలో చెడు అంతటినీ తీసేసి భూమిని పరిపాలిస్తుందనే గట్టి నమ్మకాన్ని ఇస్తాయి.