7వ సెక్షన్‌కు పరిచయం
ఈ సెక్షన్‌లో రాజైన సౌలు, రాజైన దావీదు జీవితాల గురించి 80 సంవత్సరాల చరిత్ర ఉంది. ముందు సౌలు దేవునికి భయపడుతూ వినయంగా ఉండేవాడు. కానీ కొంతకాలానికే మారిపోయాడు, యెహోవా చెప్పిన వాటిని పాటించడానికి ఒప్పుకోలేదు. కాబట్టి యెహోవా అతన్ని వదిలేశాడు. యెహోవా కొన్ని రోజులకు సమూయేలుతో ఇశ్రాయేలుకు తర్వాత రాజుగా దావీదును అభిషేకించమని చెప్పాడు. కుళ్లుబోతు అయిన సౌలు చాలాసార్లు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. కానీ దావీదు తిరిగి పగ తీర్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. సౌలు కొడుకైన యోనాతానుకు యెహోవా దావీదును రాజుగా నిర్ణయించాడని తెలుసు, అందుకే అతను దావీదుకు నమ్మకంగా ఉన్నాడు. దావీదు ఎన్నో పెద్దపెద్ద పాపాలు చేశాడు, కానీ యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ఎప్పుడూ కాదనలేదు. మీరు తల్లిదండ్రులైతే యెహోవా ఏర్పాట్లకు ఎప్పుడూ లోబడుతూ మద్దతు ఇవ్వడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి.