కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 90 పేజీ 210
  • గొల్గొతా దగ్గర యేసు చనిపోయాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గొల్గొతా దగ్గర యేసు చనిపోయాడు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • పిలాతుకు, హేరోదుకు యేసులో ఏ తప్పూ కనిపించలేదు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • పిలాతు దగ్గరనుండి హేరోదు నొద్దకు మరలా వెనుకకు
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • పొంతి పిలాతు ఎవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యేసుకు మరణశిక్ష విధించి తీసుకెళ్లారు
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 90 పేజీ 210
యేసు కొయ్య మీద వ్రేలాడుతున్నప్పుడు ఒక సైనిక అధికారి, కొంతమంది యేసు శిష్యులు, మరియ, యోహాను అక్కడే ఉన్నారు

లెసన్‌ 90

గొల్గొతా దగ్గర యేసు చనిపోయాడు

ముఖ్య యాజకులు యేసును గవర్నర్‌ ఉండే చోటుకు తీసుకెళ్లారు. పిలాతు వాళ్లను ఇలా అడిగాడు: ‘ఇతను ఏమి తప్పు చేశాడని మీరు అంటున్నారు?’ వాళ్లు ఇలా చెప్పారు: ‘ఇతను రాజు అని చెప్పుకుంటున్నాడు!’ పిలాతు యేసును “నువ్వు యూదుల రాజువా?” అని అడిగాడు. యేసు “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు” అని చెప్పాడు.

తర్వాత పిలాతు యేసును గలిలయ పాలకుడైన హేరోదు దగ్గరకు పంపిస్తాడు. యేసులో ఏమైనా తప్పు కనిపిస్తుందేమో అని అతని దగ్గరకు పంపిస్తాడు. హేరోదుకు యేసు విషయంలో ఎలాంటి తప్పు కనపడక, అతనిని తిరిగి పిలాతు దగ్గరకు పంపించేస్తాడు. అప్పుడు పిలాతు ప్రజలతో ఇలా అంటాడు: ‘ఇతని విషయంలో హేరోదుకుగానీ నాకుగానీ ఏ తప్పు కనిపించలేదు. నేను ఇతనిని వదిలేస్తాను.’ అప్పుడు ప్రజలందరూ ఇలా అరిచారు: ‘అతన్ని చంపేయండి! అతన్ని చంపేయండి!’ సైనికులు యేసును కొరడాలతో కొట్టారు, ఉమ్మి వేశారు, గుద్దారు. వాళ్లు అతని తలకు ముళ్ల కిరీటం పెట్టి, ఎగతాళి చేస్తూ ఇలా అన్నారు: ‘యూదుల రాజా, నీకు మంచి రోజు!’ పిలాతు ప్రజలందరితో మళ్లీ ఇలా అన్నాడు: ‘ఇతనిలో నాకు ఏ తప్పు కనపడలేదు.’ కానీ ప్రజలు ఇలా అరిచారు: “అతనికి కొయ్యపై శిక్ష వేయండి!” కాబట్టి పిలాతు ఆయనను శిక్ష వేయడానికి అప్పగించాడు.

యేసును గొల్గొతా అనే ప్రాంతానికి తీసుకొచ్చి ఆయన్ని మేకులతో కొయ్యకు కొట్టి, దాన్ని పైకి నిలబెట్టారు. యేసు ఇలా ప్రార్థన చేశాడు: ‘తండ్రి, వీళ్లను క్షమించు, వీళ్లు ఏమి చేస్తున్నారో వీళ్లకు తెలియదు.’ ప్రజలు యేసును ఎగతాళి చేస్తూ, ‘నువ్వు దేవుని కుమారుడివి అయితే కొయ్య మీద నుండి కిందకు రా! నిన్ను నువ్వు రక్షించుకో’ అని అన్నారు.

ఆయన ప్రక్కన వ్రేలాడదీసిన నేరస్తుల్లో ఒకడు ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు రాజ్యాధికారం పొందినప్పుడు నన్ను గుర్తుచేసుకో.” యేసు అతనికి ఇలా మాటిచ్చాడు: “నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు.” మధ్యాహ్నం ఆ దేశమంతా మూడు గంటల పాటు చీకటి అయిపోయింది. యేసు దగ్గర కొంతమంది శిష్యులు నిలబడి ఉన్నారు, వాళ్లలో యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. యేసు యోహానుతో మరియను తన సొంత తల్లిగా చూసుకోమని చెప్పాడు.

చివరిగా యేసు ఇలా చెప్పాడు: “అంతా పూర్తయింది!” అప్పుడు ఆయన తలను వంచి, చివరి శ్వాస విడిచాడు. ఆ క్షణంలో పెద్ద భూకంపం వచ్చింది. ఆలయంలో పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరు చేసే బరువైన తెర రెండుగా చీలిపోయింది. ఒక సైనిక అధికారి ‘ఇతను నిజంగా దేవుని కుమారుడు’ అని చెప్పాడు.

“దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్నైనాసరే అవన్నీ యేసుక్రీస్తు ద్వారా ‘అవును’ అన్నట్టుగానే ఉన్నాయి.”—2 కొరింథీయులు 1:20

ప్రశ్నలు: యేసును చంపేందుకు పిలాతు ఎందుకు అనుమతించాడు? తనకన్నా ఎక్కువగా ఇతరుల మీద శ్రద్ధ ఉందని యేసు ఎలా చూపించాడు?

మత్తయి 27:11-14, 22-31, 38-56; మార్కు 15:2-5, 12-18, 25, 29-33, 37-39; లూకా 23:1-25, 32-49; యోహాను 18:28–19:30

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి