కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 23 పేజీ 60-పేజీ 61 పేరా 4
  • యెహోవాకు ఇచ్చిన మాట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాకు ఇచ్చిన మాట
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా తన నియమాలను ఇవ్వడం
    నా బైబిలు కథల పుస్తకము
  • యెహోవా మార్గాలను తెలుసుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • వాళ్లు ఇచ్చిన మాట తప్పారు
    నా బైబిలు పుస్తకం
  • మండుతున్న పొద
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 23 పేజీ 60-పేజీ 61 పేరా 4
ఇశ్రాయేలీయులు సీనాయి కొండ దగ్గర నిలబడి ఉన్నారు

లెసన్‌ 23

యెహోవాకు ఇచ్చిన మాట

ఐగుప్తునుండి బయల్దేరిన రెండు నెలలకు ఇశ్రాయేలీయులు సీనాయి కొండ దగ్గరకు వచ్చి అక్కడ డేరాలు వేసుకుని ఉన్నారు. యెహోవా పిలిచినప్పుడు మోషే కొండ మీదకు వెళ్లాడు. అక్కడ మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: ‘నేను ఇశ్రాయేలీయులను రక్షించాను. వాళ్లు నా మాట విని నేను ఇచ్చిన నియమాలు పాటిస్తే వాళ్లు నా ప్రత్యేక ప్రజలుగా ఉంటారు.’ మోషే కిందకు వచ్చి, యెహోవా అన్న మాటల్ని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. దానికి వాళ్లు ఏమన్నారు? ‘యెహోవా మాకు చెప్పినవన్నీ మేము చేస్తాం’ అని జవాబిచ్చారు.

మోషే మళ్లీ ఆ కొండ మీదకు వెళ్లాడు. అక్కడ యెహోవా ఇలా అన్నాడు: ‘మూడవ రోజున నేను మీతో మాట్లాడతాను. ప్రజలు ఎవ్వరు సీనాయి కొండ మీదకు ఎక్కకూడదని చెప్పు.’ మోషే కిందకు వెళ్లి, యెహోవా మాటలు వినడానికి రెడీగా ఉండమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు.

ఇశ్రాయేలీయులు సీనాయి కొండ మీద మెరుపుల్ని, పెద్ద నల్ల మేఘాన్ని చూశారు

మూడవ రోజున ఇశ్రాయేలీయులు కొండ మీద మెరుపుల్ని, పెద్ద నల్ల మేఘాన్ని చూశారు. ఉరుముల్ని, ఒక బూర శబ్దాన్ని కూడా విన్నారు. తర్వాత యెహోవా కొండ మీదకు అగ్నిలో దిగి వచ్చాడు. ఇశ్రాయేలీయులు ఎంత భయపడిపోయారంటే వాళ్లు వణికిపోయారు. కొండ బాగా కంపించి, పొగతో నిండిపోయింది. బూర శబ్దం చాలా ఎక్కువౌతూ ఉంది. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: ‘నేను యెహోవాను. మీరు వేరే దేవుళ్లను ఆరాధించకూడదు.’

మోషే మళ్లీ కొండ పైకి ఎక్కి వెళ్లాడు. ప్రజలు పాటించడానికి నియమాలను యెహోవా అతనికి అక్కడ ఇచ్చాడు. వాళ్లు ఆయనను ఎలా ఆరాధించాలో, ఎలా ఉండాలో చెప్పాడు. మోషే ఆ నియమాలన్నీ రాసుకుని ఇశ్రాయేలీయులకు చదివి వినిపించాడు. వాళ్లు ‘యెహోవా మాకు చెప్పినవన్నీ మేము చేస్తాం’ అని మాటిచ్చారు. అవును, వాళ్లు దేవునికి మాటిచ్చారు. కానీ, వాళ్ల మాటను నిలబెట్టుకున్నారా?

“నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.”—మత్తయి 22:37

ప్రశ్నలు: సీనాయి పర్వతం దగ్గర ఏమైంది? ఇశ్రాయేలీయులు ఏం చేస్తామని మాటిచ్చారు?

నిర్గమకాండం 19:1–20:21; 24:1-8; ద్వితీయోపదేశకాండం 7:6-9; నెహెమ్యా 9:13, 14

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి