కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 22 పేజీ 56-పేజీ 57 పేరా 3
  • ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎర్ర సముద్రాన్ని దాటడం
    నా బైబిలు కథల పుస్తకము
  • ‘యెహోవా నన్ను రక్షిస్తాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ‘స్థిరంగా నిలబడి యెహోవా కలుగజేసే రక్షణను చూడండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • “ఫరో దగ్గరికి వెళ్లు”
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 22 పేజీ 56-పేజీ 57 పేరా 3
ఫరో, అతని సైన్యం

లెసన్‌ 22

ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం

ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వెళ్లిపోయారని వినగానే, ఫరో మనసు మారిపోయింది. ఆయన తన సైనికులకు ఇలా ఆజ్ఞాపిస్తాడు: ‘నా రథాలన్నిటిని సిద్ధం చేయండి, వాళ్లను వెంటాడి పట్టుకుందాం! మనం వాళ్లను వెళ్లనివ్వకుండా ఉండాల్సింది.’ ఫరో, అతని మనుషులు ఇశ్రాయేలీయుల వెంటపడ్డారు.

యెహోవా తన ప్రజలను రాత్రులు అగ్నితో, పగలు మేఘంతో నడిపించాడు. వాళ్లను ఎర్ర సముద్రం వరకు నడిపించి, అక్కడ ఆగి డేరాలు వేసుకోమని చెప్పాడు.

ఫరో, అతని సైనికులు వాళ్ల వెంట పడడం ఇశ్రాయేలీయులు చూశారు. వాళ్లు ఐగుప్తు సైనికులకు ఎర్రసముద్రానికి మధ్యలో చిక్కుకుపోయారు. వాళ్లు భయపడి మోషేతో ఇలా అన్నారు: ‘మేము చచ్చిపోతాం! నువ్వు మమ్మల్ని ఐగుప్తులోనే వదిలేయాల్సింది.’ కానీ మోషే ఇలా చెప్పాడు: ‘భయపడకండి. యెహోవా మనందర్నీ ఎలా రక్షిస్తాడో చూడండి.’ మోషే నిజంగా యెహోవాను నమ్మాడు కదా!

యెహోవా ఇశ్రాయేలీయులను అన్నీ సర్దుకొని బయల్దేరమని చెప్పాడు. ఆ రాత్రి యెహోవా ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్యలో మేఘం ఉండేలా చేశాడు. ఐగుప్తీయులకు చీకటిగా ఉంది. కానీ ఇశ్రాయేలీయులకు వెలుగు ఉంది.

సముద్రం మీద తన చేయి చాపమని యెహోవా మోషేతో చెప్పాడు. అప్పుడు యెహోవా రాత్రంతా బలమైన గాలి వీచేలా చేశాడు. సముద్రం రెండుగా చీలిపోయింది, మధ్యలో నడవడానికి ఒక దారి వచ్చింది. లక్షలమంది ఇశ్రాయేలీయులు పొడి నేల మీద, రెండు వైపుల గోడల్లా ఉన్న నీళ్ల మధ్యలో నడుచుకుంటూ సముద్రాన్ని దాటారు.

ఇశ్రాయేలీయులు పొడినేల మీద నడిచారు, నీళ్లు గోడల్లా వాళ్ల ప్రక్కన ఆగి ఉన్నాయి

సముద్రంలో ఇశ్రాయేలీయులు నడిచి వెళ్లే దారిలోకి ఫరో సైన్యం కూడా వచ్చింది. అప్పుడు యెహోవా ఆ సైన్యాలను గందరగోళంలో పడేశాడు. రథాల చక్రాలు ఊడిపడిపోతున్నాయి. సైనికులు ఇలా అరిచారు: ‘ఇక్కడ నుండి పారిపోదాం! యెహోవా వాళ్లకోసం యుద్ధం చేస్తున్నాడు.’

యెహోవా మోషేతో ఇలా అన్నాడు: ‘సముద్రంపైన నీ చెయ్యి చాపు. వెంటనే గోడల్లా ఆగిపోయిన నీళ్లు ఐగుప్తు సైనికుల మీద పడిపోయాయి. ఫరో అతని మనుషులందరూ చచ్చిపోయారు. వాళ్లలో ఒక్కరు కూడా మిగలలేదు.’

సముద్రానికి అవతల వైపు గుంపులు గుంపులుగా ఉన్న ఆ ప్రజలందరూ కలిసి దేవున్ని ఒక పాటతో స్తుతించారు: “యెహోవాను గానముచేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.” ప్రజలు పాటలు పాడుతున్నప్పుడు ఆడవాళ్లు డాన్స్‌ చేస్తూ తంబురలు వాయించారు. ప్రతీ ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు నిజంగా స్వేచ్ఛ వచ్చింది.

“అందుకే మనం మంచి ధైర్యంతో ఇలా అనగలం: ‘నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?’”—హెబ్రీయులు 13:6

ప్రశ్నలు: ఎర్ర సముద్రం దగ్గర ఏమి జరిగింది? యెహోవా ఇశ్రాయేలీయులను ఎలా రక్షించాడు?

నిర్గమకాండం 13:21–15:21; నెహెమ్యా 9:9-11; కీర్తన 106:9-12; 136:11-15; హెబ్రీయులు 11:29

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి