కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 12 పేజీ 34
  • స్వాస్థ్యం యాకోబుకు వచ్చింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్వాస్థ్యం యాకోబుకు వచ్చింది
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • భిన్నమైన కవల పిల్లలు
    నా బైబిలు కథల పుస్తకము
  • జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటూ మీ స్వాస్థ్యాన్ని భద్రంగా కాపాడుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • యాకోబు ఏశావు కలిసిపోయారు
    నా బైబిలు పుస్తకం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 12 పేజీ 34
యాకోబు గిన్నె కూరను ఇచ్చి దానికి బదులుగా ఏశావు జన్మహక్కుని తీసుకున్నాడు

లెసన్‌ 12

స్వాస్థ్యం యాకోబుకు వచ్చింది

ఇస్సాకు రిబ్కా వాళ్లకు పుట్టిన కవల పిల్లలు యాకోబు ఏశావుతో

ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు 40 సంవత్సరాలు. అతను ఆమెను చాలా ప్రేమించాడు. కొంతకాలానికి వాళ్లకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్లు కవలలు.

పెద్ద కొడుకు ఏశావు, చిన్న కొడుకు యాకోబు. ఏశావుకు బయట ఉండడం ఇష్టం, జంతువులను వేటాడడం బాగా వచ్చు. కానీ యాకోబుకు ఇంటి దగ్గర ఉండడం ఇష్టం.

ఆ రోజుల్లో తండ్రి చనిపోయాక పెద్ద కొడుకుకు ఎక్కువ స్థలాన్ని డబ్బుల్ని ఇచ్చేవాళ్లు. దానిని స్వాస్థ్యం అని పిలిచేవాళ్లు. ఇస్సాకు కుటుంబంలో ఉన్న స్వాస్థ్యానికి అబ్రాహాముకు యెహోవా చేసిన వాగ్దానాలు కూడా కలుస్తాయి. ఆ వాగ్దానాల గురించి ఏశావు పెద్దగా పట్టించుకోలేదు, కానీ యాకోబుకు మాత్రం అవి చాలా విలువైనవని తెలుసు.

యాకోబు ఏశావు

ఒకరోజు ఏశావు రోజంతా వేటాడి బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే యాకోబు చేస్తున్న వంట మంచి వాసన వస్తుంది. అప్పుడు ఏశావు యాకోబుతో ‘నాకు చాలా ఆకలిగా ఉంది. నీ దగ్గరున్న ఆ ఎర్రని కూరలో కొంచెం నాకు పెట్టు!’ అని అడిగాడు. దానికి యాకోబు ‘పెడతాను, కానీ ముందు నీకు వచ్చే స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చేస్తానని మాట ఇవ్వు’ అన్నాడు. ఏశావు ‘నాకు నా స్వాస్థ్యం పెద్ద ముఖ్యం కాదు! నువ్వే తీసుకో. నాకు ఇప్పుడు తినడానికి కావాలి’ అన్నాడు. ఏశావు అలా చేయడం తెలివైన పనే అంటారా? మీకు ఏమనిపిస్తుంది? అది తెలివైన పని కాదు. ఏశావు చాలా విలువైన దాన్ని ఒక గిన్నె కూర కోసం ఇచ్చేశాడు.

ఇస్సాకు బాగా ముసలివాడు అయ్యాక, పెద్ద కొడుకుకు ఒక ఆశీర్వాదం ఇచ్చే సమయం వచ్చింది. కానీ రిబ్కా చిన్న కొడుకైన యాకోబుకు సహాయం చేసి ఆ ఆశీర్వాదం యాకోబుకు వచ్చేలా చేసింది. ఏశావుకు దాని గురించి తెలిసినప్పుడు చాలా కోపం వచ్చి, తనతో పుట్టిన కవల తమ్ముడిని చంపేయాలనుకున్నాడు. యాకోబును ఇస్సాకు, రిబ్కా కాపాడాలనుకున్నారు, అందుకే అతనితో ‘ఏశావు కోపం తగ్గే వరకు నువ్వు వెళ్లి మీ అమ్మ తమ్ముడు లాబాను దగ్గర ఉండు’ అని చెప్పారు. యాకోబు అమ్మానాన్న చెప్పిన మాట విని ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయాడు.

“ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, అతనికి ఏం లాభం? ఒక వ్యక్తి తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏం ఇవ్వగలడు?”—మార్కు 8:36, 37

ప్రశ్నలు: ఏశావు ఎలాంటి వాడు? యాకోబు ఎలాంటి వాడు? ఏశావుకు బదులు ఆశీర్వాదం యాకోబుకు ఎందుకు వచ్చింది?

ఆదికాండం 25:20-34; 27:1–28:5; హెబ్రీయులు 12:16, 17

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి