కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 5 పేజీ 18-పేజీ 19 పేరా 5
  • నోవహు ఓడ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నోవహు ఓడ
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • నోవహు ఓడను నిర్మించడం
    నా బైబిలు కథల పుస్తకము
  • జలప్రళయం గురించి చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఎవరు వినలేదు?
    దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఆయన ‘దేవునితో నడిచాడు’
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ఆయన, ‘మరి ఏడుగురు’ రక్షణ పొందారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 5 పేజీ 18-పేజీ 19 పేరా 5
నోవహు అతని కుటుంబం ఓడను కడతారు

లెసన్‌ 5

నోవహు ఓడ

కొంత కాలానికి భూమి మీద మనుషులు పెరిగిపోయారు. వాళ్లలో చాలామంది చెడ్డవాళ్లే. పరలోకంలో కొంతమంది దూతలు కూడా చెడ్డవాళ్లు అయ్యారు. వాళ్లు ఉండే చోటును అంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఆ దూతలు కింద భూమి మీదకు వచ్చారు. వాళ్లు అలా ఎందుకు వచ్చారో మీకు తెలుసా? మనుషుల్లా శరీరాలు మార్చుకుని ఇక్కడున్న ఆడవాళ్లను పెళ్లి చేసుకోవడానికి భూమి మీదకు వచ్చారు.

ఆ దూతలకు, స్త్రీలకు కొడుకులు పుట్టారు. ఆ కొడుకులు పెద్దవాళ్లై చాలా బలంగా అందరినీ పీడించే వాళ్లగా అయ్యారు. అందరినీ క్రూరంగా ఏడ్పించేవాళ్లు. వాళ్లు అలా చేస్తుంటే యెహోవా చూస్తూ ఊరుకోలేదు. అందుకే ఒక జలప్రళయాన్ని తెచ్చి చెడ్డవాళ్లందర్నీ నాశనం చేయాలనుకున్నాడు.

నోవహు అతని కుటుంబం ఓడను కడతారు, ఆహారాన్ని సిద్ధం చేస్తారు

కానీ వాళ్లందరిలో ఒకతను వేరుగా ఉన్నాడు. ఆయన యెహోవాను ప్రేమించాడు. అతని పేరు నోవహు. అతనికి భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు ఉన్నారు. నోవహు కొడుకుల పేర్లు షేము, హాము, యాపెతు. ఆ జలప్రళయం వచ్చినప్పుడు అతనిని, అతని కుటుంబాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఓడ కట్టమని యెహోవా నోవహుతో చెప్పాడు. ఈ ఓడ నీళ్లలో తేలే పెద్ద చెక్క బాక్సులా ఉంటుంది. యెహోవా జంతువులను కాపాడడానికి వాటిని కూడా ఓడలోకి తెమ్మని నోవహుతో చెప్పాడు.

వెంటనే నోవహు ఓడ కట్టడం మొదలు పెట్టాడు. నోవహుకు అతని కుటుంబానికి ఆ ఓడను కట్టడానికి దాదాపు 50 సంవత్సరాలు పట్టింది. వాళ్లు సరిగ్గా యెహోవా చెప్పినట్లే ఆ ఓడను కట్టారు. ఆ సమయంలో జలప్రళయం వస్తుందని నోవహు ప్రజలకు చెప్పాడు. కానీ ఎవరూ ఆయన చెప్పేది వినలేదు.

చివరికి వాళ్లందరూ ఓడలోకి వెళ్లే సమయం వచ్చింది. ఆ తర్వాత ఏమి జరిగిందో చూద్దాం.

“మానవ కుమారుడి ప్రత్యక్షత నోవహు రోజుల్లాగే ఉంటుంది.”—మత్తయి 24:37

ప్రశ్నలు: యెహోవా ఎందుకు జలప్రళయాన్ని తేవాలని అనుకున్నాడు? నోవహుకి యెహోవా ఏ ఆదేశాలు ఇచ్చాడు?

ఆదికాండం 6:1-22; మత్తయి 24:37-41; 2 పేతురు 2:5; యూదా 6

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి