కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 1 పేజీ 8
  • దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు సృష్టిని ప్రారంభించడం
    నా బైబిలు కథల పుస్తకము
  • ఒక అందమైన తోట
    నా బైబిలు కథల పుస్తకము
  • అన్నిటినీ చేసిన దేవుడు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • నిన్ను సృష్టించిన దెవరు?
    భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 1 పేజీ 8
ఏదెను తోట

లెసన్‌ 1

దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు

యెహోవా దేవుడు మన సృష్టికర్త. ఆయన అన్నిటినీ, అంటే మనకు కనిపించే వాటిని కనిపించని వాటిని సృష్టించాడు. మనకు కనిపించే వాటిని చేసే ముందు దేవుడు చాలాచాలా దేవదూతల్ని చేశాడు. దేవదూతలు అంటే ఎవరో మీకు తెలుసా? దేవదూతలు యెహోవా సేవకులు. వాళ్లు ఆయనలానే ఉంటారు. మనం దేవున్ని చూడలేనట్లే వాళ్లనూ చూడలేం. యెహోవా చేసిన మొదటి దేవదూత ఆయనకు సహాయకుడు అయ్యాడు. యెహోవా నక్షత్రాల్ని, గ్రహాల్ని, ఇంకా మిగతా వాటన్నిటిని చేసినప్పుడు ఆ దేవదూత ఆయనకు సహాయం చేశాడు. ఆ గ్రహాలన్నిటిలో ఒక గ్రహం ఈ భూమి, మన అందమైన ఇల్లు.

తర్వాత జంతువులు మనుషులు ఉండడానికి వీలుగా భూమిని యెహోవా రెడీ చేశాడు. ఆయన సూర్యకిరణాలను భూమి మీద పడేలా చేశాడు. కొండల్ని, మహాసముద్రాల్ని, నదుల్ని చేశాడు.

తర్వాత ఏమైంది? యెహోవా ఇలా చెప్పాడు: ‘నేను గడ్డిని, మొక్కల్ని, చెట్లను చేయబోతున్నాను.’ రకరకాల పండ్లు, కూరగాయలు, పూలు పెరగడం మొదలయ్యాయి. తర్వాత యెహోవా ఎగిరే, ఈదే, పాకే, నడిచే జంతువులన్నిటిని చేశాడు. కుందేలు లాంటి చిన్నచిన్న జంతువుల్ని, ఏనుగు లాంటి పెద్దపెద్ద జంతువుల్ని చేశాడు. మీకు ఇష్టమైన జంతువు ఏంటి?

తర్వాత యెహోవా మొదటి దేవదూతతో ‘మనం మనిషిని తయారు చేద్దాం’ అన్నాడు. మనుషుల్ని జంతువుల్లా ఉండేలా చేయలేదు. మనుషులు కొత్తకొత్త వాటిని కనిపెట్టగలరు. వాళ్లు మాట్లాడతారు, నవ్వుతారు, ప్రార్థన చేస్తారు. భూమిని, జంతువుల్ని చూసుకుంటారు. మొట్టమొదటి మనిషి ఎవరో మీకు తెలుసా? చూద్దాం.

“మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.”—ఆదికాండం 1:1

ప్రశ్నలు: యెహోవా దేవుడు ఎవరు? యెహోవా ఏమి చేశాడు?

ఆదికాండం 1:1-26; సామెతలు 8:30, 31; యిర్మీయా 10:12; కొలొస్సయులు 1:15-17

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి